Time Travel: ఏలియన్స్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా.. ఆ ఐదు తేదీల్లో ఏం జరగబోతోంది?

Time Travel: టైం ట్రావెల్.. ఈ మాట విన్న వెంటనే గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369.

Update: 2022-10-13 06:42 GMT

Time Travel: ఏలియన్స్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా.. ఆ ఐదు తేదీల్లో ఏం జరగబోతోంది? 

Time Travel: టైం ట్రావెల్.. ఈ మాట విన్న వెంటనే గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369. ఈ సినిమాలో హీరో టైం ట్రావెల్ సీన్లు ఆడియన్స్‌ని మునివేళ్లపై నిలబెడతాయి. అయితే, సినిమాలో కాకుండా నిజ జీవితంలో టైం ట్రావెలర్‌ ఉంటే..? రానున్న ఐదు తేదీల్లో మానవాళి ఎదుర్కోబోయే ముప్పు గురించి ముందే చెబితే..? ఇప్పుడివే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రియల్ టైం ట్రావెలర్‌గా తనను తాను పేర్కొంటు ఐదు విపత్తులపై ఐదు హెచ్చరికలు ఇవే అంటున్నాడో మిస్టీరియస్ పర్సన్. ఇంతకూ, ఎవరా రియల్ టైం ట్రావెలర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి..? ఆ ఐదు తేదీల్లో మానవాళికి రాబోతున్న ముప్పేంటి..? ఏలియన్స్ ఎంట్రీకి నిజంగానే రంగం సిద్ధమైందా..?

రియల్ లైఫ్‌లో ఏమాత్రం జరిగే ఛాన్స్‌ లేని అంశాలపై ఎలాంటి అప్డేట్ వచ్చినా అది ఓ రేంజ్‌లో వైరల్ కావడం ఖాయం. ఏలియన్స్ నుంచి టైం ట్రావెలర్స్ వరకూ ఆస్టరాయిడ్స్ నుంచి కొత్త గ్రహం కనుక్కోవడం వరకూ ఇలా ఒక్కటేంటి వాట్ నాట్ అన్నట్టుగా అంతుచిక్కని మిస్టరీలపై మనిషి చూపించే ఉత్సుకత అంతా ఇంతా కాదు. డైలీ రొటీన్‌ లైఫ్‌తో సాదాసీదాగా సాగిపోయే జీవితంలో ఏదో జరగడం ఖాయం అనే వింత వాదనలపైనే టెన్షన్ అటెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియాలో లైకులు, షేర్లే ఆస్తిగా భావించే కొందరు ఇలాంటి ఊహాతీత శక్తులపైనే ఫోకస్ చేస్తున్నారు. తమను తాము టైం ట్రావెలర్స్‌గా పేర్కొంటూ భవిష్యత్ నుంచి వచ్చామనీ, భూమికి రానున్న ప్రమాదాలు ఇవేననీ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ప్రపంచాన్ని టెన్షన్ పెట్టడం ఒక్కటే వీరి పని అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఈ మధ్య కాలంలో ఈ టైం ట్రావెలర్స్‌ గోల ఇంకాస్త ఎక్కువగానే వినిపిస్తుంది. వీరంతా మాగ్జిమమ్ టిక్‌టాక్‌పై నిషేధం విధించని కంట్రీల నుంచి యాక్టివ్‌గా ఉన్నవారే. తాజాగా తనను తాను ఓ టైం ట్రావెలర్‌గా చెప్పుకునే ఓ వ్యక్తి సైతం ఓ ఐదు డేట్లు, ఐదు వార్నింగులంటూ రచ్చ చేస్తున్నాడు. అయితే, ఇతగాడు చెప్పేవి జరగడం ఖాయం అని మెజారిటీ జనం నమ్మడమే కాస్త అటెన్షన్ పెరిగేలా చేస్తుంది.

ఐదు డేట్లు ఐదు హెచ్చరికలు.. రీసెంట్‌గా తమను తాము టైం ట్రావెలర్లుగా ప్రకటించుకుంటున్న అందరూ ఇదే కాన్సెప్ట్‌తో వస్తున్నారు.. అదికూడా భారత్ నిషేధించిన టిక్‌టాక్ ఫ్లాట్ ఫామ్‌లో. అయితే, ఆ వీడియోలు టిక్‌టాక్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అవుతున్నాయి. ఇందుకు కారణం అలాంటి ఊహాతీత అప్డేట్లపై ప్రపంచానికి ఉండే ఉత్సుకతే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే, సదరు టైం ట్రావెలర్‌ ఎవరు? అతడు ఏ కాలం నుంచి వచ్చాడు? ఆ ఐదు డేట్లపై ఎలాంటి హెచ్చరికలు చేశాడు? అన్నవే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. టైం ట్రావెలర్‌గా చెప్పుకుంటున్న సదరు వ్యక్తి పేరు ఎనో అలైరిక్. అతను ఇటీవల టిక్‌టాక్‌లో వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఏకంగా భూమి భవిష్యత్తును మర్చేసే ఐదు విపత్తుల గురించి ఐదు హెచ్చరికలు తన టిక్‌టాక్‌ వీడియోలో తెలిపాడు. మానుషులు ఏలియన్స్‌తో యుద్ధం చేయడానికి మరో కొన్ని నెలలు మాత్రమే ఉన్నాయని చెప్పి షాకిచ్చాడు. ఏలియన్స్‌ భూమిపైకి వచ్చే తేదీని కూడా ప్రకటించాడు. ఈ ఏడాది డిసెంబర్ 8న గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తారని చెప్పాడు.

మరోవైపు 2వేల 671వ సంవత్సరం నుంచి తాను రియల్ టైమ్ ట్రావెలర్‌గా ఉన్నానని, రాబోయే ఈ ఐదు తేదీలను తప్పక గుర్తుంచుకోవల్సిందిగా తెలిపాడు. అయితే, సదరు వ్యక్తి చెప్పిన ఈ 5 తేదీల్లో మొదటి డేట్ ఈ ఏడాది నవంబర్ 30. ఆ రోజు నాసా జేమ్స్‌వెబ్ టెలిస్కోప్ భూమికి అచ్చు గుద్దినట్టుండే మరో గ్రహాన్ని గుర్తిస్తుందట. అంటే, మనుషులు జీవించేందుకు ఇక్కడిలానే అక్కడ కూడా అన్ని వసతులూ ఉంటాయన్న మాట. ఈ విషయం బహుశా నాసా వాళ్లు కూడా పూర్తిగా ప్రిడిక్ట్ చేసి ఉండరు. ఆ తర్వాత డేట్ 2022 డిసెంబర్ 8.. టైం ట్రావెలర్ చెప్పిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ రోజు గురించే. ఎందుకంటే ఇదే రోజున వందల ఏళ్లుగా శాస్త్రవేత్తలు వెతుకుతున్న ఏలియన్స్‌ మిస్టరీ వీడుతుందట.. స్వయంగా గ్రహాంతర వాసులే కొత్త లోహాలు, భారీ ఉల్కతో కలిసి ఏలియన్స్‌ భూమిపైకి వస్తారట. ఆ సమయంలో గ్రహాంతర వాసులతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే అన్నది ఎనో అలైరిక్ రెండో, అతిపెద్ద హెచ్చరిక. ఈ ఏడాది జరగబోయే ఘటనలు ఈ రెండే. కానీ, వచ్చే ఏడాది అంటే 2023లో మాత్రం మరో మూడు డేట్లు ఫిక్స్ చేశాడీ టైం ట్రావెలర్.

2023 ఫిబ్రవరి 6.. ఈ తేదీన నలుగురు యువకుల బృందం పురాతన శిధిలాలు, ఇతర గెలాక్సీలను వార్మ్‌హోల్‌ను తెరిచే పరికరాన్ని కనుగొంటారట. ఆ తర్వాత అదే ఏడాది మార్చి 23న మరియానా ట్రెంచ్‌ను వెదుకుతున్న శాస్త్రవేత్తల బృందం పురాతన జాతులను కనుగొంటుందట. ఆ తర్వాత అదే నెలలో అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఏకంగా 750 అడుగుల మెగా సునామీ ముచేస్తుంది. ఇవీ తనను తాను టైం ట్రావెలర్‌గా చెప్పుకుంటున్న ఎనో అలైరిక్ చెప్పిన ఐదు విషయాలు. వచ్చే ఏడాది 3-అడుగుల సాలీడు, ఒక అడుగు పొడవుండే చీమలు భూమిపై సంచరిస్తాయనే వార్తలను కూడా ఈ స్వయం ప్రకటిత టైంట్రావెలర్‌ ఖాతాలో ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే.. స్వయం ప్రకటిత టైంట్రావెలర్‌లలో ఇతను తొలి వ్యక్తి కాదు. అవును.. మీరు విన్నది నిజమే. గతంలో కూడా పలువురు వ్యక్తులు భవిష్యత్తు గురించి హెచ్చరికలు జారీ చేయండ జరిగింది.

గతంలోనే మరో స్వయం ప్రకటిత టైం ట్రావెలర్ సైతం ఇలానే ఐదు తేదీలు, ఐదు హెచ్చరికల కాన్సెప్ట్‌ను ఫాలో అయ్యాడు. అయితే, ఇతడు చెప్పిన మొదటి హెచ్చరిక తేదీ ఇప్పటికే ముగిసిపోయింది. ఆ తేదీ ఇదే నెల అంటే 2022 అక్టోబర్ 8. ఆ రోజు ఓ జాంబీ పంది ల్యాబ్ నుంచి తప్పించుకుని భూమిపై ఉన్న 60శాతం పందులను జాంబీలుగా మార్చేస్తుందని తెలిపాడు. అయితే, ఇప్పటివరకూ ప్రపంచంలో అలాంటి ఘటన జరిగినట్టు ఎలాంటి అప్డేట్ రాలేదు. నిజానికి జాంబీ అనేది కూడా సినిమాటిక్ కాన్సెప్టే. ఇక రెండో హెచ్చరిక ప్రకారం ఈ ఏడాది నవంబర్ 1న క్లాసిఫైడ్ ఫైల్స్ ద్వారా ఏలియన్స్ భూమిపై దిగిన విషయం బయటపడుతుందన్నాడు. అంటు ఇతడు కూడా వరల్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఏలియన్స్‌ను విడిచిపెట్టలేదు. ఇక మూడో హెచ్చరిక ప్రకారం నవంబర్ 14న 10మంది మనుషులు సూర్యుడి నుంచి అతీంద్రియ శక్తులు పొందుతారని తెలిపాడు. అచ్చంగా హాలీవుడ్ మూవీ ఫెన్టాస్టిక్ ఫోర్‌ మాదిరిగా అన్నమాట. అలాగే, నాలుగో డేట్ డిసెంబర్ 10.. ఈ రోజు అనారోగ్య కారణాల కారణంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదవి నుంచి దిగిపోతారట. ఐదు డేట్‌ వచ్చే ఏడాది జనవరి 13.. ఆరోజు అజావాని మనుషులు కనుక్కుంటారన్నాడు. అజావా అనేది భూమి లోపల ఉండే మరో ప్రపంచం అని చెప్పి షాకిచ్చాడు.

వీళ్లు నిజంగానే టైమ్ ట్రావెలర్సా అనేది ఒక ప్రశ్న. వీళ్లు చెప్పేది నిజమేనా అనేది మరో ప్రశ్న. ఇదంతా వట్టి ట్రాష్ అనేవారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉంటే మంచిదేగా అనేవారూ లేకపోలేదు. పైపెచ్చు వీళ్లు చెబుతున్న జాంబీ పందులు, ఏలియన్స్, అజావా లాంటి అంశాలన్నీ ఊహాతీతమైన అంశాలే. రియల్ లైఫ్‌ పాయింట్ వన్ పర్సెంట్ కూడా జరిగే ఛాన్స్ లేదు. కాబట్టే ఈ వీడియోలకు జనం అట్రాక్ట్ అవుతున్నారు. అంతే తప్ప స్వయం ప్రకటిత టైం ట్రావెలర్స్ చెప్పే వాటిలో ఒక్కటి కూడా జరిగే ఛాన్స్ లేదు. సో స్వయం ప్రకటిత టైం ట్రావెలర్స్‌ చెప్పేది చెబుతుంది జస్ట్ టైం పాస్‌గా తీసుకుంటే సరే కానీ సీరియస్‌గా తీసుకుని ఎదో జరిగిపోతోందని భయపడితే పెద్ద తప్పే అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 

Tags:    

Similar News