Pakistan: క్వెట్టా రైల్వేస్టేషన్ వద్ద బాంబు పేలుడు.. 25 మంది మృతి
Pakistan: పాకిస్తాన్ లోని క్వెట్టా రైల్వేస్టేషన్ వద్ద శనివారం జరిగిన బాంబు పేలుడులో 20 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు.
Pakistan: పాకిస్తాన్ లోని క్వెట్టా రైల్వేస్టేషన్ వద్ద శనివారం జరిగిన బాంబు పేలుడులో 25 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. రైల్వే ఫ్లాట్ పారానికి సమీపంలోని బుకింగ్ ఆఫీస్ వద్ద పేలుడు జరిగిందని జియో న్యూస్ తెలిపింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం 9 గంటలకు పెషావర్ నుంచి బయలుదేరాల్సి ఉంది. పేలుడు జరిగిన సమయంలో రైలు ఇంకా ఫ్లాట్ ఫారం వద్దకు చేరుకోలేదు.
ఇది ఆత్మాహుతి దాడి మాదిరిగా ఉందని క్వెట్టా సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ పీ ఆపరేషన్స్ మహమ్మద్ బలోచ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సంఘటన జరిగిన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంఘటన స్థలంలో క్లూ స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశించారు.
పేలుడుపై విచారణకు ఆదేశం
బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో సాధారణ ప్రజలు మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలు, కార్మికులు, పిల్లలు, మహిళలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేశారని ఆయన ఆరోపించారు.