Green Card: భారతీయులకు షాకివ్వనున్న ట్రంప్..గ్రీన్ కార్డులు అందని ద్రాక్షే?

Green Card: అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది.

Update: 2024-11-08 02:57 GMT

Green Card: భారతీయులకు షాకివ్వనున్న ట్రంప్..గ్రీన్ కార్డులు అందని ద్రాక్షే?

Green Card: అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకు ఏటా లక్షల్లో జనం ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్తుంటారు. అందులో కొంతమంది అక్కడే స్థిరపడి గ్రీన్ కార్డులు కూడా పొందుతారు.

గ్రీన్ కార్డు అనేది అమెరికాలో శాశ్వత నివాసం కోసం. అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపై కన్నేసినట్లు సమాచారం. ట్రంప్ తీసుకోనున్న ఈ నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న 10లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

డొనాల్డ్ ట్రంప్..అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయంతో మరోసారి అమెరికా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మొదట్నుంచీ అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికన్లకే చెందాలంటూ ట్రంప్ వాదన మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..ఇతర దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై కన్నేశారు. గ్రీన్ కార్డు రూల్స్ మార్చేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగినట్లయితే అమెరికాలోని గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడునున్నట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లయితే వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా సిటిజన్ షిప్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే ట్రంప్ స్వస్తి పలికేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డు నిబంధనలు ముసాయిదా ప్రతిపాదన ప్రకారం అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్దంగా శాశ్వత నివాసి అయి ఉండాలి. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గ్రీన్ కార్డు నిబంధనల్లో తీసుకువచ్చే మార్పుల వల్ల 10లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్ లో చిక్కుకున్నందున ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాల టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే న్యాయనిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదంటున్నారు. హెచ్ 1 బి వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఖన్నా తెలిపారు. ట్రంప్ గ్రీన్ కార్డుల విషయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన మొదలైంది.  

Tags:    

Similar News