Tik tok is shifting: టిక్ టాక్ ప్రధాన కార్యాలయం మార్చేస్తుందా?
Tik tok is shifting: ప్రపంచవ్యాప్తంగా యావత్తు యువతరాన్ని అమితంగా ఆకట్టుకున్న పాపులర్ ఆప్ లో టిక్‌టాక్ ఒక్కటి. కానీ కరోనా వైరస్ వ్యాప్తికి చైనా నే కారణమని ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం.
Tik tok is shifting: ప్రపంచవ్యాప్తంగా యావత్తు యువతరాన్ని అమితంగా ఆకట్టుకున్న పాపులర్ ఆప్ ల్లో టిక్‌టాక్ ఒక్కటి. కానీ కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం చైనానే ప్రపంచ దేశాలు నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ లోని గల్వనా లోయలో భారత సైనికులపై దాడి చేయడంతో ..ఆ దాడిని ప్రతిఘటిస్తూ.. మోడీ సర్కారు .. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేలా..డిజిటల్ వార్ ను ప్రకటించారు. అందులో భాగంగానే.. చైనా కు చెందిన టిక్ టాక్ ఆప్ తో పాటు 59 ఆప్ బ్యాన్ చేసినా విషయం చేసిందే. ప్రపంచ దేశాలు చైనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నతరుణంలో టిక్ టాక్ తన కార్యా కలపాలను మార్చాలని యోచిస్తోన్నట్టు తెస్తుంది.
అలాగే మరో వైపు.. చైనా ప్రభుత్వం నుంచి కూడా తనకు ఏదైనా 'ముప్పు' పొంచి ఉండవచ్చునన్న భయంతో టిక్ టాక్ మెల్లగా తన ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి మార్చుకోవాలనుకుంటోది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తమ ప్రధాన కార్యాలయాని లండన్ కి తరలించేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందట. చైనాలో దీని మాతృక సంస్థ 'బైట్ డాన్స్…అయితే ఈ సంస్థకు దూరం కావాలనుకుంటోందని తెలిసింది. ఇదే సమయంలో ఇతర లొకేషన్స్ ని కూడా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది కాలిఫోర్నియాలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ ... టిక్ టాక్ మాత్రం లండన్ ఎలాగైనా తన కార్యాలయం ఏర్పాటు చేయడం పైనే ఉందంటా. ఈ తరుణంలో అమెరికాలో ఈ సంస్ధపై గట్టి నిఘా ఉంది. దీనిపై అమెరికా ప్రభుత్వానికి అనుమానాలు పెరిగిపోతున్నాయి. యూజర్ డేటాను మార్చివేయాలని చైనా దీనిపై ఒత్తిడి పెంచుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఏమైనా….. రానున్న సంవత్సరాల్లో చైనా బయటే తన కార్యకలాపాలను కొనసాగించాలని టిక్ టాక్ గట్టి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. భారత ప్రభుత్వం లాగానే .. టిక్ టాక్ ను తాము కూడా నిషేధించాలని యోచిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇటీవల వెల్లడించారు.