అప్ఘాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకం.. ఎయిర్ పోర్టు స్వాధీనం.. ఆర్థిక మంత్రి రాజీనామా

Afghanistan: అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది.

Update: 2021-08-11 13:39 GMT

అప్ఘాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకం.. ఎయిర్ పోర్టు స్వాధీనం.. ఆర్థిక మంత్రి రాజీనామా

Afghanistan: అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. తాజాగా మరో మూడు ప్రావిన్సులను వారు స్వాధీనం చేసుకున్నారు. అల్లరి మూకలు, అరాచక శక్తులు యధేచ్ఛగా వీధుల్లో సంచరిస్తున్నాయి. గాడ్ ఈజ్ గ్రేట్ అని అరుస్తూ ప్రావిన్సులను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నాయి. గృహలు స్కూళ్ల దహనాలకు పాల్పడుతున్నాయి.

ఇప్పటికే మూడింటా రెండొంతుల దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు తాజాగా కుందుజ్ ఎయిర్ పోర్టును చెరబట్టారు. భారత్ పంపిన విమానాన్ని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. అప్ఘాన్ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేందా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో తల దాచుకున్నట్లు సమాచారం. అమెరికా నాటో దళాలు దశల వారీగా ఉపసంహరిస్తున్న సమయంలో తాలిబన్లు చెలరేగిపోతున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో భారతీయులందరినీ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో వెనక్కి రప్పిస్తోంది.

Tags:    

Similar News