బాహుబలి మందు.. రోగం ఏదైనా ఒకే మందు.. కొత్త డ్రగ్‌ను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు..

University Of Illinois: సాధారణంగా మనకు జ్వరం వచ్చినా.. తలనొప్పి వచ్చినా.. చిన్న చిన్నవి ఇంకేవైనా.. మెడికల్‌ షాప్‌కు వెళ్లి.. ట్యాబ్లెట్ తీసుకోవడం అలవాటు..

Update: 2022-08-15 13:14 GMT

బాహుబలి మందు.. రోగం ఏదైనా ఒకే మందు.. కొత్త డ్రగ్‌ను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు..

University Of Illinois: మనిషిని వదలకుండా.. ఇబ్బంది పెడుతున్న అన్ని బ్యాక్టీరియాలకు ఒకే మందును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యాంటీ మైక్రో బయాల్‌ రిసిస్టెన్స్ -AMRను కనిపెట్టారు. ఇది ఏకంగా 300 బ్యాక్టీరియలపై పని చేస్తున్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. తాజాగా ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బ్యాక్టీరియాలను AMR సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఉన్నడెబియా-1452 అనే యాంటిబయాటిక్‌ను కొన్ని మార్పులతో ఎలుకల్లో ప్రయోగించారు.

అది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పని చేసింది. సాధారణ యాంటీ బయాటిక్స్‌ను ఎక్కువగా వినియోగిస్తే ఈ-కొలి, న్యూమోనియా, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే అన్ని బ్యాక్టీరియాలకు ఒకే మెడిసిన్‌ను రూపొందించాలని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలను చేశారు. వారి ఫలితాల వివరాలను తాజాగా సైన్స్‌ జర్నల్‌ ACS ప్రచురించింది. డెబియా -1452 ఇప్పటికే రెండో ఫేస్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. అంటువ్యాధులను నివారించడంలో ఈ డెబియా కీలకపాత్ర పోషించనున్నట్టు వెల్లడించారు.

Tags:    

Similar News