Omicron: 22 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్
Omicron: కోవిడ్ నయా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Omicron: కోవిడ్ నయా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ 22 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రీసెంట్‌గా సౌదీ అరేబియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసు నమోదైంది. నిన్న జపాన్‌లో కూడా ఓమిక్రాన్ కేసు బయటపడింది. కాగా ఓమిక్రాన్ విస్తరించిన దేశాల్లో ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బోట్స్వానా, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నైజీరియా, పోర్చుగల్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యూకే చేరిపోయాయి. ఈ దేశాల్లో ప్రస్తుతం కేసులు నమోదు కావడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆందోళనకి గురి అవుతున్నాయి.