ఆప్ఘన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నేతృత్వంలో తాలిబన్లపై తిరుగుబాటు

* ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లపై మొదలైన తిరుగుబాటు * చారికర్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న అప్ఘనిస్తాన్‌ సైన్యం

Update: 2021-08-18 04:29 GMT

ఆప్ఘన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ (ట్విట్టర్ ఫోటో)

Afghanistan: ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. ఆప్ఘన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నేతృత్వంలో ఈ తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లపై తిరుగుబాటు చేస్తోన్న ఆప్ఘన్‌ సైన్యం చారికర్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. పంజ్‌షీర్‌ ప్రాంతంలోని తాలిబన్లపై కూడా ఆప్ఘన్‌ సైన్యం తిరుగుబాటును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తాను తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్న వైస్‌ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్‌ తనకు మద్దతు ఇవ్వాలని నేతలను కోరుతున్నారు.

Tags:    

Similar News