Attack on Trump: ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తి ఇంట్లో బాంబులు తయారీ..FBI షాక్
Attack on Trump:అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో ట్రంప్ కు స్వల్పగాయాలయ్యాయి. కాల్పులకు తెగబడిన నిందితుడిని కాల్చి చంపాయి భద్రతాబలగాలు. ట్రంప్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి ఇల్లు, కారులో బాంబు తయారీకి సంబంధించిన భారీ నిల్వను చూసి అమెరికా పోలీసులు షాక్ అయ్యారు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిపిన వ్యక్తి ఇల్లు,కారులో సోదాలు చేయగా బయటపడిన మెటీరియల్‌ను చూసి అమెరికా పోలీసులే కాదు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కూడా ఆశ్చర్యపోయింది.పోలీసుల విచారణలో దుండగుడి కారులో బాంబు తయారీ సామగ్రి లభ్యమైంది. ఈ సమాచారాన్ని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 'ఏపీ'మీడియాకు అందించారు.నిందితుడి ఇంట్లో బాంబు తయారీ సామాగ్రి కూడా లభించిందని తెలిపారు.
దాడి చేసిన వ్యక్తి ఇల్లు, కారులో నుంచి బాంబు తయారీ సామగ్రిని గుర్తించిన తర్వాత..యుఎస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అయితే ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఎఫ్ బీఐకి అధికారులు దుండగుడి ఇంట్లో నుంచి బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్న అనంతరం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ (78) శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఎన్ కౌంటర్ చేసింది.
దాడి చేసినవారి లక్ష్యం చాలా ఖచ్చితంగా ఉందని..అయితే అదృష్టం ట్రంప్‌ను తృటిలో కాపాడింది. బుల్లెట్ ట్రంప్ చెవిని తాకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బుల్లెట్ ర్యాలీలో ఉన్న మరొక వ్యక్తికి తగిలి అతని చెవికి గాయమైంది. కాగా దుండగుడి పోలీసులు అక్కడిక్కడే కాల్చి చంపారు.ఈ బుల్లెట్ ట్రంప్ తలకు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్పష్టమవుతోంది.బుల్లెట్ నేరుగా తలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల దుండగుడు ట్రంప్ పై అనేక రౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ ట్రంప్ తప్పించుకున్నారు. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 'సీక్రెట్ సర్వీస్' సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని హతమార్చారు.