Afghanistan: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తాలిబన్లు
Afghanistan: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల అరాచక నిర్ణయాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి.
Afghanistan: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల అరాచక నిర్ణయాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఆఫ్ఘన్ జైలులో ఉన్న 200మందికి పైగా ఖైదీలను తాలిబన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఖొరాసాన్, సిరియా, ఇరాక్‌లలో ఇస్లామిక్ స్టేట్ ఆధారిత మిలిటెంట్ గ్రూపులు దేశంలో ప్రధాన ప్రజా భద్రత సమస్యగా ఎదుగుతున్నప్పటికీ తాలిబన్ ఖైదీలను విడుదల చేయడం ఆఫ్ఘన్‌లలో తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. హెల్మాండ్, ఫరా ప్రావిన్సులలోని జైళ్లలో ఉన్న 600 మందికి పైగా ఉగ్రవాదులను ఈ ఏడాది ప్రారంభంలో తాలిబాన్ విడుదల చేసినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ స్పుత్నిక్ వార్తా సంస్థ పేర్కొంది. తాజాగా మరో 210మందిని బయటకు వదలడం వారి భయానికి కారణం అవుతోంది.