Longest Train In World: 100 బోగీలు, నాలుగు ఇంజిన్లతో ప్రపంచంలోనే అతిపొడవైన రైలు

Longest Train In World: ఈ రైలు పొడవు 1.91 కిలోమీటర్లు

Update: 2022-10-30 11:04 GMT

Longest Train In World: 100 బోగీలు, నాలుగు ఇంజిన్లతో ప్రపంచంలోనే అతిపొడవైన రైలు

Longest Train In World: మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలు రమణీయ దృశ్యాలు అనేక మలుపులు లోయల్లోని అందాలు ఇది న్యూజీలాండ్‌లోని ఆల్ఫ్ష్‌ పర్వత ప్రాంతాల్లో కనిపించే మనోహర దృశ్యాలు. అయితే ఈ అందాలను తిలకించేందుకు తాజాగా న్యూజీలాండ్‌ ప్రభుత్వం కొత్తగా ప్రపంచంలోనే పొడవైన రైలును ప్రారంభించింది. గిన్నీస్‌ రికార్డ్ సాధించిన ఈ రైలును రెయిషేన్‌ రైల్వే కంపెనీ నిర్మించింది. దీని పొడవు 1.91 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజరు రైలు ఇదే. ఈ ట్రైన్‌లో 100 బోగీలు, నాలుగు ఇంజిన్లు ఉంటాయి. ఈ ట్రైన్‌ 25 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి గంట సమయం పట్టింది. ఇది ప్రధానంగా ఆల్ఫ్స్‌ పర్వత ప్రాంతంలోనిఆల్బులా, బెర్నియా మార్గంలో నడుస్తుంది. ప్రఖ్యాత లాండ్‌ వాసర్‌ బ్రిడ్జితో సహా.. మొత్తం 22 సొరంగాలు, 48 వంతెనలపైన అనేక లోయలు, మలుపుల్లో వెళ్తోంది. ఈ రైలు తిరిగే మార్గాన్ని యునెస్క్‌ 2008లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. స్విస్‌ రైల్వే ఏర్పడి.. 175 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలును ప్రారంభించినట్టు రేయిషేన్‌ రైల్వే డైరెక్టర్‌ రెనాటో ఫాస్కియాటీ తెలిపారు. స్విట్జర్లాండ్‌లో సాధించిన ఇంజినీరింగ్‌ అధ్బుతాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని చెప్పారు.

ఈ రైలు ప్రయాణాన్ని కేవలం స్క్రీన్‌లో తిలకించేందుకు 3వేల మంది టికెట్లను తీసుకున్నారు. ఈ ట్రైన్‌ ప్రయాణించే మార్గంలో.. ట్రాఫిక్‌ను నియంత్రించారు. పలువురు పర్వత ప్రాంతాల్లో ఈ పొడవైన రైలు దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించడం కనిపించింది. ఇంత పొడవైన రైలును సురక్షితంగా ప్రయాణించేలా చేయడం అద్భుతమని గిన్నీస్‌ బుక్‌ ప్రతినిధి తెలిపారు. ఈ రైలులో ఏడుగురు లోకో పైలట్లు, 21 మంది సాంకేతిక నిపుణులు ప్రయాణించారు. నాలుగు ఇంజిన్లలో ఉన్న లోకో పైలట్లు.. మొదటి ఇంజను డ్రైవర్‌ మార్గనిర్దేశనం చేసేలా రూపొందించారు. స్విట్జర్లాండ్‌ దేశంలో భారీ రైల్‌ నెట్‌వర్క్‌ విస్తరించి ఉంది. ఇక్కడి రైళ్లు టైమింగ్‌ను పక్కాగా పాటిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఈ ఆల్ఫైన్‌ దేశం.. 1847 ఆగస్టు 9న మొదటి రైలును ప్రారంభించింది. జ్యూరిచ్‌ నుంచి బాడెన్‌తో కలిపే ఈ రైలు మార్గంలో తొలి రైలు 23 కిలో మీటర్ల దూరం నడిచింది. అప్పట్లో ఈ యాత్రకు 33 నిమిషాలు పట్టిందట.

ఇదిలా ఉంటే.. న్యూజీలాండ్‌ రైలు కంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైళ్లు ఉన్నాయి. అయితే అవి ప్యాసింజరు రైళ్లు కాదు. ప్రయాణికులను తరలించే రైళ్లలో 100 బోగీలతో 1.91 కిలోమీటర్ల పొడవైనది మాత్రం స్విట్జర్లాండ్‌దే. ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. కాకపోతే అది గూడ్స్ రైలు. ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్‌పీ ఐరన్ ఓర్ రైలు పొడవు 7.32 కిలో మీటర్లు. దీన్ని ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలుగా గుర్తించారు. ఇక భారత్ విషయానికి వస్తే మన దగ్గర కూడా పొడవైన గూడ్స్ రైలు ఉంది. దాని పేరు 'సూపర్ వాసుకి'. దీని పొడవు 3.5 కిలో మీటర్లు. ఇది భారత్‌లోనే అత్యంత పొడవైన, బరువైన రైలు ఇది. ఈ రైలు నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా మధ్య 27వేల టన్నులకుపైగా బొగ్గును తరలిస్తోంది. ఈ రైలుకు 295 లోడెడ్ వ్యాగన్‌లతో టెస్ట్ రన్ నిర్వహించారు రైల్వే అధికారులు.


Tags:    

Similar News