Sunita Williams: మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్‌

Sunita Williams: స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష ప్రయాణం

Update: 2024-04-24 15:10 GMT

Sunita Williams: మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్‌

Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షయానం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ కూడా వెళ్లనున్నారు. అక్కడ ఒక వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఈమేరకు నాసా ప్రకటించింది. ఐతే ఈసారి ఆమె బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో నిర్వహిస్తోన్న మొదటి మానవ సహిత మిషన్ ఇది. దీనిలో భాగంగా స్టార్‌లైనర్ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

ఈ పర్యటన విజయవంతమైతే.. అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. షెడ్యూల్ ప్రకారం.. మే 6న ఈ లాంచింగ్ జరగనుంది. కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్‌ ఖ్యాతి గడించారు. సునీత తొలి పర్యటన.. 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు సాగింది.

Tags:    

Similar News