Student Visa: ఆగస్టు 1 తరువాతే రండంటున్న అమెరికా
Student Visa: అమెరికాలో హైయ్యర్ స్టడీస్ చదవాలనుకునే విద్యార్థులను ఆగస్టు తరువాతే దేశంలోకి అనుమతి
Student Visa: అమెరికాలో హైయ్యర్ స్టడీస్ చదవాలనుకునే విద్యార్థులను ఆగస్టు తరువాతే దేశంలోకి అనుమతిస్తామని హైదరాబాద్ కాన్సులేట్ వెల్లడించింది. మంగళవారం ఈ మేరకు అధికారిక ట్విట్టర్ లో ఓ ప్రకటనను షేర్ చేసింది. కరోనా వైరస్ కట్టడికి అమెరికా అధ్యక్షుడు విధించిన నిబంధనలు అమలులో ఉన్నాయని, దీంతో విదేశీ విద్యార్థులందరికీ ఆగస్టు 1 తరువాత మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తామని పేర్కొంది.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉండటంతో.. విద్యార్థి వీసా (ఎఫ్)లు పొందినప్పటికీ వారిని దేశంలోకి అనుమతించలేమని పేర్కొంది. భారత్‌తోపాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా స్టూడెంట్లకు ఇవే నిబంధనలు వర్తిస్తాయంది. ఆగస్టు 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ అమెరికన్ ఎంబసీని ఆశ్రయించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.