భారీగా పెరిగిన చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ రూ. 254, డీజిల్ రూ.214...
Petrol and Diesel Prices Hike: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది...
Petrol and Diesel Prices Hike: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంధన ధరలను భారీగా పెంచింది. దీంతో ఆదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సంచరినీ దాటేశాయి. లీటర్ డీజిల్ పై 75, పెట్రోల్ పై 50 రూపాయల చొప్పున పెంచినట్లు ఎల్‌ఐఓసీ వెల్లడించింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర 254, డీజిల్ ధర 214 రూపాయలకు ఎగబాకింది.
శ్రీలంకలో ఒకె నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశంలో ఇంధన ధరలు గరిస్ఠ స్థాయికి చేరడం మూలిగే నక్కపై తాడిపండు పడినట్లయ్యింది. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సహా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడం.. చమురు, గ్యాస్ ధరల పెరుగుదలకు కారమవుతున్నాయని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ చెబుతున్నారు.
శ్రీలంక సర్కార్ నుంచి ఎల్ఐఓసీ ఎలాంటి రాయితీలు పొందదని.. ఫలితంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో సంస్థ నష్టపోతోందని మనోజ్ వెల్లడించారు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే ఇంధన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదన్నారు ఆయన. ధరలు పెంచినప్పటికీ భారీ నష్టాలు తప్పడం లేదని ఆయన ఆందోళణ వ్యక్తం చేశారు.