మా వజ్రం ఇచ్చేయండి.. బ్రిటన్‌ను డిమాండ్‌ చేస్తున్న దక్షిణాఫ్రికా

*కోహినూర్‌లాగే కల్లినన్‌-1 డైమాండ్‌ ప్రసిద్ది

Update: 2022-09-20 03:00 GMT

మా వజ్రం ఇచ్చేయండి.. బ్రిటన్‌ను డిమాండ్‌ చేస్తున్న దక్షిణాఫ్రికా

Cullinan Diamond: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్-2 మరణం తరువాత.. రాజ కుటంబం ఆధీనంలో ఉన్న వజ్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఇటీవల కోహినూర్‌ పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ భారీగా ట్రెండ్‌ అయ్యింది. ఇప్పుడు అలాంటి డిమాండే దక్షిణాఫ్రికాలోనూ మొదలయ్యింది. ఆఫ్రికా ఖండంలోనే ప్రసిద్ధి చెందిన కల్లినన్‌ అనే వజ్రాన్ని తమకు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కల్లినన్‌ వజ్రం రాణికి చెందిన రాజదండంపై మర్చబడి ఉంది. ప్రస్తుతం రాణి కన్నుమూశారని.. మా వజ్రాలు మాకు ఇచ్చేయాలని దక్షిణాఫ్రికా ప్రజలు కోరుతున్నారు. కల్లినన్‌ వజ్రం అత్యంత విలువైనదే కాకుండా చారిత్రత్మకంగా చాలా ప్రసిద్ధి చెందినదని చెబుతోంది. దీన్ని లండన్‌ టవర్‌లోని జ్యువెల్‌ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనలో ఉంచినట్లు దక్షిణాఫ్రికా చెబుతోంది.

కల్లినన్‌ వజ్రం ఒక బిందువు ఆకారంలో ఉంటుంది. దీన్ని 1600 ఏళ్ల నాటి ఈ వజ్రాన్ని వలస పాలకులు బ్రిటిష్‌ రాజకుటుంబానికి అప్పగించాయి. బ్రిటన్‌ రాణికి చెందిన రాజ దండంలోని క్రాస్‌ గుర్తులో కల్లినన్‌ వజ్రం పొదగబడి ఉందని దక్షిణాఫ్రికా చెబుతోంది. తమ దేశ ఖనిజాలతోనూ, ప్రజల సొమ్ముతోనూ బ్రిటన్‌ కులుకుతోందని దక్షిణాఫ్రికన్లు ఎత్తి పొడుతున్నారు. తాజాగా దక్షిణాప్రికా పార్లమెంట్‌ సభ్యుడు వుయోల్వేతు జుంగులా కల్లినన్‌ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. బ్రిటన‌ చేసిన నిర్వాకానికి పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. దొంగిలించిన మొత్తం సొమ్మును ఇచ్చేయాలంటూ సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. తమ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆన్‌లైన్‌లో.. change dot org అనే వెబ్‌సైట్‌లో పిటిషన్‌ కూడా వేశారు.

రాణి ఎలిజబెత్‌ మరణంతో.. భారత్‌లో సోషల్‌ మీడియాలో కోహినూర్‌ వజ్రంపై జోరుగా చర్చ జరుగుతోంది. కోహినూర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ భారీగా ట్రెండ్‌ అవుతోంది. కోహినూర్‌ వజ్రం తమదని.. ఇప్పటికైనా భారత్‌కు అప్పగించాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. భారత్‌ నుంచి దోచుకున్న పురాతన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేయాలంటున్నారు. భారత ప్రభుత్వం కూడా అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే.. దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం పలుమార్లు బ్రిటన్‌ను సంప్రదించింది. 2010లో అప్పటి యూకే ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ స్పందించారు. ఒకవేళ భారత్‌కు కోహినూర్‌ను ఇవ్వాల్సి వస్తే.. చాలా దేశాలకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీంతో బ్రిటీష్‌ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని చమత్కరించారు.

దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా విచారణ జరిపింది. కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి తీసుకురావడం కష్టమని తేల్చి చెప్పింది. యాంటిక్విటీస్ అండ్‌ ఆర్ట్‌ ట్రెజర్‌ యాక్ట్‌-1972 ప్రకారం.. దేశం నుంచి అక్రమంగా ఎగుమతి చేసినవి.. లేదా తస్కరించిన అరుదైన వస్తువులు, సంపదను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ వారికి బహుమతిగా ఇచ్చిన వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయమని ఒత్తిడి చేయాలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కాని పలువురు భారతీయ నెటిజన్లు మాత్రం.. కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి తెప్పించాలని.. మళ్లీ ప్రభుత్వం అందుకు చొరవచూపలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Tags:    

Similar News