Russia: కొవిడ్ టీకా ఆవిష్కరణలో రష్యా మరో మైలురాయి
Russia: కొవిడ్ టీకా ఆవిష్కరణలో రష్యా మరో మైలురాయిని చేరుకుంది.
Russia: కొవిడ్ టీకా ఆవిష్కరణలో రష్యా మరో మైలురాయిని చేరుకుంది. ఆ దేశానికి చెందిన ఆర్‌డీఐఎఫ్ సంస్థ రెండు డోసుల 'స్పుత్నిక్ వి' టీకాను తీసుకువచ్చిన సంగతీ తెలిసిందే ఇప్పుడే అదే సంస్థ ఒకే డోసు 'స్పుత్నిక్ లైట్'టీకాను తయారు చేసింది. ఈ టీకాకు రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. ఈ టీకా తీసుకున్న 28 రోజుల్లో వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు ఆర్‌డీఎఫ్ వెల్లడించింది. పైగా నూతన వేరియంట్లను కూడా ఎదుర్కొంటుందని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం రష్యా, యూఏఈ, ఘనా దేశాల్లో ఈ టీకాపై మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 7వేల మంది వాలంటీర్లు ఈ టీకా డోస్ తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఒకే డోస్ టీకా ప్రభావం ఏ స్థాయిలో పని చేస్తోంది ప్రూ కానుంది.
'స్పుత్నిక్ వి' టీకాపై మన దేశంలో మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి హెటెరో బయోఫార్మా సన్నద్ధమవుతోంది. దీనికే అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ మండలికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. 'స్పుత్నిక్ వి' టీకా పంపిణీకి ఆర్‌డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ టీకాపై డాక్టర్ రెడ్డీస్ అన్ని దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించి, టీకా పంపిణీకి అనుమతి సంపాదించింది.