బ్రిటన్ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్న రిషి షినాక్

*113 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్న లిజ్ ట్రస్

Update: 2022-07-21 02:30 GMT

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్న రిషి షినాక్

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరో అడుగు ముందుకేశారు. ఐదో రౌండ్‌లోనూ రిషి సునాక్‌ 137 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ ​తక్కువ ఓట్లతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రధాని రేసులో సునాక్​తో పాటు విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్​ మాత్రమే మిగిలారు.

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి, భారత సంతతి రిషి సునాక్ క్రమక్రమంగా పట్టు బిగిస్తున్నారు. బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లోనూ రిషి సునాక్‌ అత్యధిక మెజారిటీ 137 ఓట్లు సాధించారు. ఈ క్రమంలో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌ ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో ప్రధాని పదవి కోసం పోటీలో ఇద్దరే నిలిచారు.

ఇక చివరి రౌండ్​లో ఆ దేశ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్​తో రిషి తలపడనున్నారు. తుది అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో లక్షా 60వేల మంది అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకుంటారు. తుది పోరులో గెలిచిన వ్యక్తిని సెప్టెంబర్‌ 5న ప్రకటిస్తారు. ఇలా కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా విజయం సాధించేవారే బ్రిటన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు.

Tags:    

Similar News