బ్రిటన్‌ను 178 ఏళ్లు పాలించిన ముగ్గురు రాణులు.. ప్రపంచంపై క్వీన్ ఎలిజబెత్-2 ప్రత్యేక ముద్ర
*ఎలిజబెత్-2 హయాంలో ద్వీపదేశంగా యూకే
Queen Elizabeth Legacy: బ్రిటన్ రాణులంటే విలాసవంతమైన జీవనశైలి, ప్రయాణాలు, అధికారం, హోదా.. ఒకప్పుడు సూర్యడు అస్తమించిన రాజ్యం బ్రిటన్... అలాంటి దేశాన్ని.. క్వీన్ ఎలిజబెత్-1, క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్-2 178 ఏళ్లు పాలించారు. వీరిలో ఎలిజబెత్-1, విక్టోరియా రాణుల కాలంలో ఎంతో హాయిగా గడచిపోయింది. కానీ.. ఎలిజబెత్-2కు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. రెండో ప్రపంచ యుద్ధంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ఆ సమయంలో ఎలిజబెత్-2కు పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్ కాలనీలు ఒక్కొక్కటిగా స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. దీంతో అప్పటివరకు ప్రపంచానికి కేంద్రబిందువుగా మారిన బ్రిటన్.. ఒంటరిగా మిగిలిపోయింది. అసలు క్వీన్ ఎలిజబెత్-1, క్వీన్ విక్టోరియా పాలనా కాలంలో ఎలా వ్యవహరించారు? వారికి క్వీన్ ఎలిజబెత్-2కి ఉన్న తేడాలు ఏమిటి?
బ్రిటన్ రాణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మొదటి రాణి.. క్వీన్ ఎలిజబెత్-1 ముందుంటారు. ఆమె పాలించిన 1558 నుంచి 1603 కాలాన్ని బ్రిటన్ స్వర్ణయుగంగా పిలుస్తారు. అప్పట్లో రాచరికం అనేది అనవాయితీగా ఉండేది. క్వీన్ ఎలిజబెత్-1 హయాంలోనే ఇంగ్లిస్ సాహిత్యం వర్దిల్లింది. విలియమ్ షేక్స్‌పియర్, క్రిష్టఫర్ మార్లోవ్ పేర్లు మార్మోగిపోయాయి. ఎలిజబెత్-1 కాలంలోనే సముద్రయాణం బ్రిటిషర్ల ఉధృతమైంది. బ్రిటన్ నేవల్ అధికారి ఫ్రాన్సిస్ డ్రాకే ఆధ‌్వర్యంలో నౌకాదళం సముద్రయానంపై మంచి పట్టు సాధించింది. మొదటి ఎలిజబెత్ రాణి 25 ఏళ్లలోనే బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించింది. ఆ బ్రిటన్ ప్రజలతో పాటు.. ఎలిజబెత్-1 పాలన కూడా హాయిగానే గడిచిపోయింది. 1558లో అధికారం చేపట్టిన ఆమె.. 1603లో చనిపోయేవరకు రాణిగా ఉన్నారు. క్విన్ ఎలిజబెత్-1 తరువాత విక్టోరియా మహారాణి పాలనను విక్టోరియన్ శకంగా పిలుస్తారు. 63 ఏళ్ల 7 నెలల పాటు బ్రిటన్‌ను ఆమె పాలించింది. ఆమె హయాంలోనే బ్రిటన్.. సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యంగా ఎదిగింది. అంటే.. బ్రిటన్ సూపర్ శక్తిగా ఎదిగింది. విక్టోరియా హయాంలోనే పారిశ్రామిక విప్లవం మొదలైంది. విక్టోరియా మహారాణితో పోలిస్తే.. ఎలిజబెత్-2 కాలం ఎలా ఉంది? ఎలిజబెత్-1, విక్టోరియా రాణులతో పోలిస్తే.. ఎలిజబెత్-2 హయాంలో బ్రిటన్ ఏమైంది?
20వ శతాబ్దంలో రెండు ఘోరమైన ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అదే సమయంలో స్వతంత్ర పోరాటాలు ఉధృతమయ్యాయి. మానవ హక్కుల పోరాటాలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ప్రజాస్వామ్యం అన్నమాట నినాదంగా వినిపించింది. ఆ సమయంలో రాచరికం అనేది రాక్షసవాదంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాచరిక పాలనలకు వ్యతిరేకంగా పోరాటలు ఉధృతమయ్యాయి. పోర్చుగల్, జర్మనీ, ఇటలీ, బల్గేరియా, గ్రీస్, రొమేనియా, రష్యా, టర్కీ దేశాల్లో రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. రాజ్యాలు అంతమయ్యాయి. అయితే రాచరికం స్థానంలో ఎలాంటి మెరుగైన వ్యవస్థలు ఏర్పడనప్పటికీ.. రాజుల పాలన మాత్రం ముగిసింది. కానీ.. బ్రిటన్‌లో మాత్రం అలా జరగలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కూడా బ్రిటన్‌లో రాచరికం కొనసాగింది. ఆ క్రెడిట్ క్వీన్ ఎలిజబెత్-2కి చెందుతుంది. ఆమెను ప్రపంచమంతా గౌరవించింది. ప్రజాస్వామ్య యుగంలోనూ ఆమెను రాణిగా గౌరవనీయంగా అంగీకరించడమే. దీంతో విక్టోరియా తరువాత అత్యధిక కాలం బ్రిటన్‌ను పరిపాలించిన రాణిగా.. ఎలిజబెత్-2 చరిత్ర సృష్టించారు. బ్రిటన్ దేశానికి 70 ఏళ్ల పాటు ఆమె మహారాణిగా ఉన్నారు. అన్నేళ్లపాటు ఆమె రాణిగా ఉండడానికి.. ఆమె ఆయుష్షు ఏమాత్రం కారణం కాదు.. రాచరికాన్ని, ఆమె పాలనను ప్రజలు ఆమోదించడమే.
ఇప్పుడు బ్రిటన్ రాజకుటుంబం మంచిగా కనిపిస్తున్నది. కానీ.. క్వీన్ ఎలిజబెత్-2 పూర్వీకులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. బానిసత్వం, బలవంతపు శ్రమ దోపిడీ, వర్ణ వివక్ష, ఊచకోతలకు పాల్పడ్డారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా క్వీన్ ఎలిజబెత్-2ను ప్రేమించారు. గతంలోని బ్రిటన్ కాలనీలుగా ఉన్న దేశాలు.. స్వతంత్రం పొందిన తరువాత కూడా రాజకుంటంబంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాయి. అందుకు కారణం.. ఎలిజబెత్-2 కుటుంబం బాప్టిజం తీసుకోవడమే. బాప్టిజం తీసుకున్న తరువాత.. రాజరికాన్ని ప్రపంచం కొత్త కోణంలో చూసేలా క్వీన్ ఎలిజబెత్ చేశారు. అంతేకాకుండా ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎలిజబెత్ వ్యవహరించారు. దీంతో రాజ్యం చిన్న ద్వీపంగా మారిపోయినా.. ఆమె మాత్రం 14 కామన్వెల్త్ దేశాలకు రాణిగా ఉండిపోయింది. కాలం చెల్లిన వ్యవస్థను సంస్కరించడానికి ఎలిజబెత్-2 చేసిన నిజమైన ప్రయత్నమా? లేక తమ సంపదను, అధికారాలను కాపాడుకోవడానికి చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వాటికి సమాధానం దొరకడం మాత్రం కష్టమే. కానీ.. ప్రపంచానికి రాజ్యాంగ రాజరికాల కోసం ఎలిజబెత్-2 ఓ నమూనా అందించారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆధ్యాత్మికతను జోడించి.. కిరీటాన్ని చివరికి వరకు బ్రిటన్ రాణి దక్కించుకున్నది. అదే సమయలో ఆమె ప్రపంచాన్ని ఒప్పించగలిగింది. ఇలా చేయడం అంత సులువు కాదు..
బ్రిటిష్ పౌరులు మాత్రం క్వీన్ ఎలిజబెత్-2ను వేరే కోణంలో చూస్తున్నారు. మహారాణి అంటే.. బ్రిటన్ జాతీయ ఐక్యతకు, శక్తికి ప్రతీగా చెబుతున్నారు. అయితే దేశాన్ని కాపాడి.. ఐక్యంగా నిలపడంలో రాణి పూర్వీకులు కృషి చేసి ఉండొచ్చు. కానీ.. క్వీన్ ఎలిజబెత్-2 బలహీనమైన దేశానికి రాణిగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే బ్రిటన్ సూపర్ పవర్ హోదాను కోల్పోయింది. అంతేకాకుండా.. ఐరోపా సమాఖ్య నుంచి కూడా వేరుపడి.. కేవలం ద్వీప దేశంగా మాత్రమే యునైటెడ్ కింగ్‌డమ్ మిగిలిపోయింది. ఆమె హయాంలోనే స్కాట్లాండ్ స్వాతంత్రం కోసం పోరాడుతోంది. అందుకు ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఈ వైఫల్యాలన్నీ రాణి హయాంలోనే జరిగాయి. ఎన్నో సవాళ్లను బ్రిటన్ ఎదుర్కొన్నప్పటికీ ఎలిజబెత్-2 దేశాన్ని ఏకతాటిపై నిలిపారు. క్వీన్ ఎలిజబెత్-2 వారసత్వం.. 20వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపింది. కానీ.. 21వ శతాబ్దంలో మాత్రం రాచరికానికి పెను సవాళ్లు ఎదురయ్యాయి. క్వీన్ ఎలిజబెత్-2 మాత్రమే ప్రపంచాన్ని ఓప్పించింది. తనను రాణిగా అంగీకరించేలా ఆమె చేసుకుంది. ప్రపంచంపై బ్రిటన్ క్వీన్ చెరగని ముద్రవేసింది.
ఆధునిక ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో రాజ వంశాలు ఉన్నా.. వారందరి కంటే.. బ్రిటన్ రాజవంశం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. అలా ప్రత్యేకతను క్వీన్ ఎలిజబెత్-2 నిలుపుకున్నారు. కుటుంబంలో ఎన్నో వివాదాలు తలెత్తినా.. విమర్శలు వచ్చినా.. వాటిని తట్టుకుని.. 96 ఏళ్ల పాటు జీవించారు. మనవళ్లను, ముని మనవళ్లను చూశారు. 96 ఏళ్ల వయస్సులో చనిపోయారు.