Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూత

Queen Elizabeth II: బ్రిటన్‌లో సుధీర్ఘకాలం పాటు పాలించిన రాణి ఎలిజబెత్

Update: 2022-09-09 01:32 GMT

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూత

Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 తనువు చాలించారు. బ్రిటన్‌లో ఒక శకం ముగిసింది. 96 యేళ్ల ప్రాయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగి చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు 76 ఏళ్లుగా రాణిగా కొనసాగారు. 2015 వరకు ఈ రికార్డు ఆమె నానమ్మ క్వీన్ విక్టోరియా పేరుతో ఉండేది. క్వీన్ ఎలిజబెత్ హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానులు పనిచేశారు.

ఎలిజబెత్‌-2.. ఏప్రిల్‌ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్‌ స్ట్రీట్‌లో జన్మించారు. క్వీన్ ఎలిజబెత్ అసలు పేరు అలెగ్జాండ్ర మేరి. తల్లిదండ్రులు.. కింగ్‌ జార్జ్‌-6, క్వీన్‌ ఎలిజబెత్‌. గ్రీస్‌ యువరాజు, నేవీ లెఫ్టినెంట్‌ ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్‌ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్‌ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

క్వీన్‌ ఎలిజబెత్‌-2 పట్టాభిషేకానికి.. సోవియట్‌ యూనియన్‌, చైనా, యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి జోసెఫ్‌ స్టాలిన్‌, మావో జెదాంగ్‌, హ్యారీ ట్రూమన్‌ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్‌ ప్రధానిగా విన్‌స్టన్‌ చర్చిల్‌ ఉన్నారు. ఇక 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్‌ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో పాటుగా 14 దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్‌, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్‌ ఐల్యాండ్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌, ది గ్రెనాడైన్స్‌, తువాలుకు కూడా క్వీన్‌ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరించారు.

రాణి ఎలిజబెత్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బాల్మోరల్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడటం కూడా అతి కష్టంగా చేస్తున్నారు. దీంతో ఆమె అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల కిందటే బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ స్కాట్లాండ్‌కి వెళ్లి రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు. ఆమె ఆశీస్సులు తీసుకొని బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఎలిజబెత్‌-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్- 3 పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News