ChatGPT: చాట్ జీపీటీ ఘనకార్యం.. క్లాస్ మొత్తం ఫెయిల్..

* టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ చాట్ జీపీటీ చెప్పిందని తన విద్యార్థులందర్ని ఫెయిల్ చేశాడు. అయితే చాట్ జీపీటీ చెప్పింది అని తేలింది. దీంతో..

Update: 2023-05-18 15:30 GMT

Chat GPT: చాట్ జీపీటీ ఘనకార్యం.. క్లాస్ మొత్తం ఫెయిల్..

ChatGPT: ఇటీవలి కాలంలో చాట్ జీపీటీ అనే సాంకేతిక విప్లవంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాట్ జీపీటీ పై కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు మానవ మేథ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల విషయంలో అయితే చాట్ జీపీటీ పట్ల ఆందోళన తీవ్రంగా ఉంది. విద్యార్థుల మేథోశక్తిని తగ్గించేస్తుందనే వాదనలు ప్రధానంగా ఉన్నాయి. ఈ కారణంగానే న్యూయార్క్ లోని స్కూల్స్ లో చాట్ జీపీటీ టూల్ వాడకాన్ని నిషేధించారు.

ఇదిలాఉంటే, చాట్ జీపీటీ చెప్పిందని ప్రొఫెసర్ తన క్లాసులోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తమ ఫైనల్ ఎగ్జామ్స్ లో భాగంగా తాము రాసిన వ్యాసాలను ప్రొఫెసర్ కు సమర్పించారు. విద్యార్థులు వారి వ్యాసాలను సొంతంగా రాసారో లేదో తెలుసుకోవడానికి సదరు ప్రొఫెసర్ చాట్ జీపీటీ టూల్ ని ఉపయోగించారు. చాట్ జీపీటీ ఆ వ్యాసాలను పరీక్షించి...విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు సొంతంగా రాయలేదని..కంప్యూటర్ ద్వారా రాసినవని తేల్చింది.

దీంతో ప్రొఫెసర్ మొత్తం విద్యార్థులను ఫెయిల్ చేశారు. అందరూ ఫెయిల్ కావడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు. అయితే చాట్ జీపీటీ తప్పుచేసిందని ఆ తర్వాత తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని..కంప్యూటర్లను ఉపయోగించలేదని బయటపడింది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి..మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు.

Tags:    

Similar News