నెల రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్ దంపతులకు కరోనా
అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధి ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. గురువారం నిర్వహించిన..
అధ్యక్ష ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధి ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. గురువారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో వారికి పాజిటివ్ వచ్చినట్టు.. స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో తామిద్దరూ ఐసోలేషన్ లోకి వెళుతున్నట్టు ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా ఇటీవల ట్రంప్ సలహాదారు హాప్ హిక్స్ కరోనా సోకింది. దాంతో ట్రంప్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కాగా కొద్దిరోజులుగా హాప్ హిక్స్ విరామం లేకుండా విదుల్లో నిమగ్నమై ఉండటం వలెనే ఆయనకు కరోనా వచ్చిందని.. ఇది చాలా విచారకరమని ట్రంప్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను వ్యతిరేకించిన ట్రంప్..అధికారిక కార్యక్రమాల్లోనూ.. చాలా సందర్భాల్లో మాస్కులు లేకుండానే ఉన్నారు.
ఇదిలావుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ప్రెసిడెంట్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి జోబిడెన్ తమ ప్రచారాన్ని ఉదృతం చేశారు. వీరిద్దరి మధ్య ఈ మంగళవారం కరోనాపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్బంగా ట్రంప్ పై తీవ్రంగా మండిపడ్డారు జోబిడెన్. అటు ట్రంప్ కూడా పదునైన మాటలతో జోబిడెన్ కు సమాధానం ఇచ్చారు.