PM Modi US Visit: రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశమైన ప్రధాని మోదీ
PM Modi US Visit: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూయార్క్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం. న్యూయార్క్‌లో ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలిశానని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో ఉక్రెయిన్‌లో మా పర్యటన ఫలితాలను అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రధాని పేర్కొన్నారు.
PM Modi US Visit: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూయార్క్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం.న్యూయార్క్‌లో ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలిశానని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో ఉక్రెయిన్‌లో మా పర్యటన ఫలితాలను అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా పరిష్కరించడం, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడం కోసం భారతదేశం మద్దతును పునరుద్ఘాటించారు.
ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. మూడు నెలల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య జరిగే మూడో భేటీ ఇది. ద్వైపాక్షిక అంశాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. ఈ విషయాలపై భారత్ అప్రమత్తతను అధ్యక్షుడు జెలెన్స్కీ ఎంతో ప్రశంసించారని తెలిపారు.
ప్రధాని మోదీ పర్యటన ఎంతో అభినందనీయమని, ఈ వివాదం నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు జెలెన్క్సీ. ద్వైపాక్షిక సంబంధాలు అనేక అంశాలపై సానుకూల పరిణామాలకు సాక్ష్యంగా ఉన్నాయని ఇరుపక్షాలు ప్రశంసించారు. ఇరువర్గాలు పరస్పరం సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించాయి.
కాగా ప్రధాని మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌ను సందర్శించారు. ఉక్రెయిన్ వివాదంలో శాంతిని త్వరగా తిరిగి తీసుకురావడానికి సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించాలని భారత్ సూచనగా పునరుద్ఘాటించారు. 1992లో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో తొలిసారిగా పర్యటించిన సందర్భంగా అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ను సందర్శించారు.