Pakistan: ఇజ్రాయెల్‌లో పాక్ సీక్రెట్ టూర్
*ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించేందుకు వెనుకుండి చక్రం తిప్పుతున్న అమెరికా
Pakistan: అది పక్కా ముస్లిం వ్యతిరేక దేశం.. కానీ.. సైనిక శక్తిలో, గూఢచార్యంలో ప్రపంచాన్ని అబ్బురపర్తుంది. ఇన్నాళ్లు ఆ దేశమంటే.. ముస్లిం కంట్రీస్‌కు అస్సలు పడేది కాదు.. మన పొరుగున ఉన్న పాకిస్థాన్ అయితే.. నిప్పులు చెరిగేది.. ఎందుకంటే.. ఆ దేశంతో భారత్‌కు స్నేహ బంధం బలంగా ఉంది కాబట్టి.. పైగా ముస్లిం దేశాల మధ్యన ఉన్న క్రిస్టియన్ దేశం.. ఆ దేశం మరేదో కాదు.. ఇజ్రాయెల్.. రెండ్రోజుల క్రితం ఇజ్రాయెల్‌లో పాకిస్థాన్ అధికారుల బృందం రహస్యంగా పర్యటించింది. దీంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అసలు పాకిస్థాన్ అధికారులు ఇజ్రాయెల్‌లో ఎందుకు పర్యటించారు? రుణాలను అడిగేందుకా? లేక సరికొత్త ఆయుధాలను కొనుగోలు చేసేందుకా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్ రాజధాని జెరుసలేంలో రెండు దేశాల బృందాలు రహస్యంగా పర్యటించాయి. ఆ దేశాలు మరేవో కాదు.. పాకిస్థాన్, ఇండోనేషియా.. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. యూదులను తీవ్రంగా వ్యతిరేకించే దేశాలు ఏవైనా ఉన్నాయంటే.. అవి పాకిస్థాన్, ఇండోనేషియానే. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తరచూ జరుగుతున్న పోరాటల నేపథ్యంలో.. ఇస్లామిక్ దేశాలన్నీ.. ఇజ్రాయెల్‌పై కత్తిగట్టాయి. అదే సమయంలో చుట్టూ ఉన్న ముస్లిం దేశాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్.. రక్షణ, గూఢచార్యంపై దృష్టిని కేంద్రీకరించింది. ఈ క్రమంలో.. రక్షణ, నిఘా రంగంలో ప్రపంచానికే నంబర్ వన్‌గా జెరుసలేం నిలిచింది. ఇన్నాళ్లు జెరుసలేంను ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పైగా ఇజ్రాయెల్‌ను దేశంగా ఇస్లాం కంట్రీస్ గుర్తించడం లేదు. పాలస్తీనాలో భాగంగానే పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో అధికారికంగా ఎలాంటి ఒప్పందాలు లేవు.
అలాంటిది ఇప్పుడు పాకిస్థాన్, ఇండోనేషియా పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపింది. అందులో ప్రధానంగా కరుడుగట్టిన ఇస్లామిక్ దేశం పాకిస్థాన్ అధికారుల బృందం జెరుసలేంకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అసలు పాకిస్థాన్, ఇండోనేషియా బృందాలు ఇజ్రాయెల్‌కు ఎందుకు వెళ్లాయి? జెరుసలేం వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడానికా? లేక.. రుణాలను తెచ్చుకోవడానికా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌లో ఇండోనేషియా, పాకిస్థాన్ దేశాల బృందాలు పర్యటన వివరాలు బయటికి రాలేదు. అటు ఇజ్రాయెల్, ఇటు ఇస్లామాబాద్, జకార్తా కానీ.. అధికారికంగా వెల్లడించలేదు. దీంతోనే అందరిలోనూ సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. నిజానికి ఇండోనేషియా.. సీనియర్ అధికారుల బృందాన్ని జెరుసలేంకు పంపింది. పాకిస్థాన్ మాత్రం.. కీలకమైన వ్యక్తుల బృందాన్నే పంపింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నసీం అష్రాఫ్ ఆధ్వర్యంలోని 10 మంది బృందాన్ని పంపింది. వారు ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కలవనున్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఇజ్రాయెల్ విషయంలో ముస్లిం దేశాలు ఇప్పటివరకు పాత విధానాలనే పాటించాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పలు దేశాల ఇజ్రాయెల్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అందులో భాగంగానే ముస్లిం దేశాలు కూడా జెరుసలేం వద్ద ఉన్న ఆయుధాలపై ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాకుండా.. ఆ దేశం నుంచి రుణాలను పొందేందుకు సైతం సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తున్నాయి. మొదట ఇజ్రాయెల్‌ను దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యూఏఈ, బహ్రెయిన్ గుర్తించాయి. ఈ కోవలోకి ఇప్పుడు పాకిస్థాన్, ఇండోనేషియా కూడా చేరాయి. త్వరలో సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్‌ను దేశంగా అంగీకరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జులైలో ఇండోనేషియాలో ఇజ్రాయెల్ అధికారులు పర్యటించారు. నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతకుముందు జనవరిలోనూ కోవిడ్ విధానాలపై ఇజ్రాయెల్‌తో ఇండోనేషియా సహకారం తీసుకుంది. ఇందులో జాకర్తానే కీలక పాత్ర పోషించింది.
పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్‌తో బంధాన్ని కోరుకుంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మేలోనే పాకిస్థానీ అమెరికన్ ప్రతినిధులు జెరుసలెంలో పర్యటించారు. రెండు నెలల క్రితం అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్, అమెరికాతో కలిసి.. పాకిస్థాన్ సైనిక విన్యాసాలను కూడా నిర్వహించింది. ఇజ్రాయెల్, పాకిస్థాన్, ఇండోనేషియా మధ్య.. అమెరికానే కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించేలా అమెరికా లాబియింగ్ చేస్తోంది. ప్రధానంగా మిలటరీ, ఆర్థిక వ్యవహారాలనే పాకిస్థాన్, ఇండోనేషియా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇండోనేషియాకు 50 కోట్ల డాలర్ల అనధికార ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో వ్యాపారం, ఆయుధాల కొనుగోలుకు ఇస్లామాబాద్ ప్రాధాన్యమిస్తున్నట్టు సమాచారం. జెరుసలేం ఇప్పటికే నిఘా వ్యవస్థల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశం ఇండోనేసియా.. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలు కూడా ఉన్నాయి. అయితే తమకు గుర్తింపే ముఖ్యమన్నట్టుగా ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఇన్నాళ్లు పాకిస్థాన్, ఇండోనేషియా దేశాలు ఇజ్రాయెల్‌కు ఎందుకు దూరంగా ఉన్నాయి? అంటే.. ఆయా దేశాల్లో ప్రజల సెంటిమెంటే కారణం.. అక్కడి ప్రజలు ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నేతలు జెరుసలేంతో సంబంధాలకు మొగ్గుచూపలేదు. జెరుసలేంకు అనుకూలంగా రిస్క్ తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రజలు సెంటిమెంట్‌ను మార్చేయగల సామర్థ్యమున్న దేశం.. సౌదీ అరేబియానే.. ముస్లిం ప్రపంచానికి రియాద్ నాయకత్వం వహిస్తోంది. ఇజ్రాయెల్‌ను సౌదీ గుర్తిస్తే.. మిగిలిన నేతలంతా వరుసకట్టే అవకాశం ఉంది. అయితే పాలస్తీనా పరిస్థితి ఏమిటంటే.. అది అత్యంత క్లిష్టమైన సమస్యే. పాలస్తీనాకు మద్దతు ఇచ్చే పలు ముస్లిం దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌వైపు చూస్తున్నాయి. అందుకు కారణం.. టెక్నాలజీ, ఆయుధాలు, వ్యాపారమే.. సొంత ప్రయోజనాలకే ఏ దేశమైనా ప్రాధాన్యమిస్తోంది.
అయితే తాజా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇజ్రాయెల్ నుంచి పాకిస్థాన్ ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది? లేదంటే వ్యాపార సంబంధాలకే పరిమితమవుతున్నదా? అనే అంశంలో ఢిల్లీ ఆచితూచి అడుగేస్తోంది.