Pakistan: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్

Pakistan: గుదిబండలా మారుతున్న రుణభారం

Update: 2023-05-06 10:00 GMT

Pakistan: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్

Pakistan: పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. తరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్యాలు.. ద్రవ్య నిల్వలు.. గుదిబండలా మారుతున్న రుణభారం పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్ నిలిచింది. అక్కడ చిల్లర ధరల ద్రవ్యోల్బణం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 36.4 శాతం పెరిగింది. ధరల పెరుగుదల విషయంలో శ్రీలంకనూ ఇస్లామాబాద్‌ మించిపోయింది. ప్రస్తుతం అప్పులు చెల్లించలేని దుస్థితి పాక్ కు ఏర్పడింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ నుంచి ఆర్థిక సాయం పొందినా మెరుగుపడలేదు. నిజానికి 1960,1990 మధ్య కాలంలో దక్షిణాసియాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా పాక్ నిలిచింది. 1990 లో పాకిస్తాన్ ‌లో ఒక వ్యక్తి సగటు సంపాదన ఇండియాతో పోలిస్తే దాదాపు 25శాతం అధికం.అలాంటి పాక్ ప్రస్తుతం దారుణమైన దుస్ధితిలోకి జారిపోయింది. పాక్ లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం 30 శాతానికి మించి ఎగబాకింది. గత 48 ఏళ్లలో ఇదే గరిష్టం. ప్రస్తుతం పెరిగిన ధరలను భరించే స్ధోమత లేక పాక్ ప్రజలు అల్లాడుతున్నారు.

Tags:    

Similar News