Pakistan: శ్రీలంక దారిలోనే పాకిస్తాన్‌.. ఇప్పుడు మరో బ్యాడ్‌న్యూస్‌..!

Pakistan: దేశానికి ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అది కుప్పకూలిందంటే అంతే సంగతులు.

Update: 2022-07-04 15:30 GMT

Representational image

Pakistan: దేశానికి ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అది కుప్పకూలిందంటే అంతే సంగతులు. దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల శ్రీలంకలో జరిగిన పరిస్థితులని పేర్కొనవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్‌ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆర్థిక రంగంలో పాకిస్థాన్‌ నిరంతరం విఫలమవుతూనే ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ వాణిజ్య లోటు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది.

నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ వాణిజ్య లోటు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి $48.66 బిలియన్లకు చేరుకుంది. క్రితం ఏడాది 30.96 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 57 శాతం పెరిగింది. దిగుమతులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల వాణిజ్య లోటు గణనీయంగా పెరిగిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 'ది డాన్' వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మేలో 800 కంటే ఎక్కువ అనవసరమైన లగ్జరీ వస్తువుల దిగుమతిని నిషేధించింది. అయినప్పటికీ వాణిజ్య లోటు చాలా ఎక్కువగానే ఉంది.

జూన్ నెలలో పాకిస్థాన్ వాణిజ్య లోటు 32 శాతం పెరిగి 4.84 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. 2017-18తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 37 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. ఆ సమయంలో చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా దిగుమతులు ఎక్కువగా పెరిగాయి. అదే సమయంలో, 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 31.8 బిలియన్ డాలర్లకు తగ్గింది.

Tags:    

Similar News