Mohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్

Mohammad Hafeez: పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ సంచలన ట్వీట్

Update: 2022-05-26 05:10 GMT

Mohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్

Mohammad Hafeez: పాకిస్తాన్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ను పదవిలోంచి దించేసిన తర్వాత పాకిస్తాన్ లో నిరసనలు మిన్నంటుతున్నాయ్. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడంతో ఆయన దూకుడు పెంచారు. ఇలాంటి సమంయలో పాక్ వాణిజ్య రాజధాని లాహోర్‌లో పెట్రోల్ లేదని ఏటీఎం మిషన్లలో డబ్బుల్లేవంటూ పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ట్వీట్ సంచలనం రేపుతోంది. అన్ని ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించిన హఫీజ్ మూడు ఫార్మాట్లలో 12 వేలకు పైగా పరుగులు, 250 వికెట్లను పడగొట్టి.. పాక్ క్రికెట్ లో కొత్త ఊపు తీసుకొచ్చారు. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన హఫీజ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ కెప్టెన్‌గా కొంత కాలం వ్యవహరించాడు.

ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి మాత్రమే కామెంట్స్ చేసే హఫీజ్ ఒక్కసారిగా చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో ఉత్కంఠ రేపాయ్. సామాన్య ప్రజల సమస్యలను అర్థం చేసుకోండంటూ పాక్ రాజకీయనేతలను ట్యాగ్ చేశారు మహ్మద్ హఫీజ్. రాజకీయ నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాలా అంటూ ప్రశ్నించాడు. అదే ట్వీట్ ను ప్రధాని షబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ట్యాగ్ చేశారు. మొత్తంగా పాకిస్తాన్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. ఓవైపు ఆర్మీ, అమెరికా అండదండలతో తాజా ప్రధాని షబాజ్ షరీఫ్ కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. పాకిస్తాన్ లో ప్రస్తుత సిచ్యువేషన్ శ్రీలంకను తలపిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయ్ ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఆర్థికంగా ఆదుకోకపోతే పాక్ లో తిప్పలు తప్పేలా లేవంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

Tags:    

Similar News