కార్గిల్ యుద్ధం చేశాం: 25 ఏళ్ల తర్వాత ఒప్పుకున్న పాకిస్తాన్
కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్టుగా ఇండియన్ ఆర్మీ తెలిపింది.
కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్న విషయాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అంగీకరించింది. 1948, 1965,1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది సైనికులు ప్రాణత్యాగం చేశారని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ చెప్పారు. ఈ యుద్ధం జరిగిన 25 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని పాకిస్తాన్ ఒప్పుకుంది.
రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో శుక్రవారం జరిగిన డిఫెన్స్ డే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కార్గిల్ యుద్దంలో తమ పాత్ర లేదని ఇంతకాలం పాకిస్తాన్ తోసిపుచ్చింది. 1999 మే-జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి శత్రుసేనలు వచ్చాయి.. కార్గిల్ లో ఖాళీగా ఉన్న మన కీలక స్థావరాలను కైవశం చేసుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది.
కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్టుగా ఇండియన్ ఆర్మీ తెలిపింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహిస్తున్నారు. కార్గిల్ యుద్దానికి తమకు సంబంధం లేదని పాకిస్తాన్ తోసిపుచ్చుతూ వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలను ఇండియా బహిర్గతం చేసింది. కానీ, వాటిని ఖండించింది. తాజాగా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కార్గిల్ యుద్ధానికి పాకిస్తాన్ కారణమని తేలింది.