కొత్త లుక్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌

Kim Jong Un: హాలీవుడ్‌ యాక్షన్‌ హీరోలా కిమ్‌ ఎంట్రీ

Update: 2022-03-28 16:00 GMT

కొత్త లుక్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ 

Kim Jong Un: స్టైల్‌ అంటే టక్కున గుర్తొచ్చేది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. అయితే ఇప్పుడు రజనీ స్టైల్‌ను తలదన్నేలా మరో యాక్షన్‌ హీరో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. లెదర్‌ జాకెట్‌, నల్లటి సన్‌ గ్లాసెస్‌తో, అదిరిపోయే మ్యూజిక్‌తో అదగొడుతున్నాడు. ఆ యాక్షన్‌ హీరో ఎవరో కాదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో కిమ్‌ కొత్త లూక్‌ వీడియో కిరాక్‌ పుట్టిస్తోంది. ఉత్తర కొరియన్‌ ప్రజలకు జోష్‌ నింపాలనుకుని రూపొందించిన ఆ వీడియో కథ ఏమిటో మీరూ చూసేయండి.

ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచం ఆందోళన చెందుతోంది మరోవైపు తరచూ క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా అధక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రెచ్చిపోతున్నారు. తాజాగా ఉత్తర కొరియా కొత్త తరహా ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్‌-17ను ప్రయోగించడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగలిగేలా.. ఈ క్షిపణిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ మిస్సైల్‌ ప్రయోగ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ లెదర్‌ జాకెట్‌, సన్‌ గ్లాసెస్‌ ధరించి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ దృశ్యాలకు హాలీవుడ్‌ టచ్‌ ఇచ్చి వీడియోను ఎడిట్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో మూసుకున్న తలుపులు తెరుచుకున్నాయి. లెదర్ జాకెట్‌, సన్‌ గ్లాసులు ధరించారు కిమ్‌ పక్కన ఇద్దరు సైనికాధికారులకు ఏవో సూచనలు ఇస్తూ... క్షిపణి ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చారు. ఇక ప్రయోగానికి సమయం దగ్గర పడుతుండడంతో కిమ్‌ వాచ్‌ను గమనిస్తూ ఆ తరువాత స్టైల్‌గా తన కళ్ల అద్దాలను తీసి.. ఓకే చెప్పారు. ఆ తరువాత క్షిపణి ప్రయోగ వాహనం బయటకు వచ్చింది.. క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి 6వేల 200 కిలోమీటర్లకు ఎత్తుకు వెళ్లినట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో సస్సెన్షన్‌ థ్రిల్లర్‌ను తలపించేలా మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోను కిమ్‌ ప్రభుత్వమే విడుదల చేసింది.

ఉత్తర కొరియాలో పేదరికంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. దేశంలో దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి. పేదరిక నిర్మూలనకు అక్కడి నియంతలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టరు. అయితే ఆ దేశ నియంతలకు సినిమాలంటే పిచ్చి. అభివృద్ధికి నిధులు ఇవ్వకపోయినా కిమ్‌ ప్రభుత్వం సినిమాలపై చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిధులను ఇస్తోంది. అయితే ఆ సినిమా నిర్మాణాల్లోనూ ఎక్కువ భాగం కిమ్‌ కుటుంబాన్ని కీర్తించడానికే కేటాయిస్తున్నారు. తాజాగా కిమ్‌ ప్రభుత్వ విడుదల చేసిన వీడియోను కూడా హాలీవుడ్‌, దక్షిణ కొరియా సినిమాలను స్పూర్తిగా తీసుకుని ఎడిట్‌ చేసినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఉత్తర కొరియాలో దక్షిణ కొరియా, లేదా ఇతర దేశాల సినిమాలపై నిషేదం ఉంది. ఎవరైనా విదేశీ సినిమాలు, నీలి చిత్రాలు చూస్తే శిక్షలు భారీగా విధిస్తారు. అలాంటిది తాజా వీడియోలో కిమ్‌ లూక్‌ విదేశీ సినిమాల స్టైల్‌లో రూపొందించారు. ఇలా కిమ్‌ను ఉత్తర కొరియా ప్రజలు ముందెన్నడూ చూడలేదు. క్షిపణిని ప్రయోగిద్దాం రండి అని కిమ్‌ చెబుతున్నట్టుగా ఆ దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ దృశ్యాలు టాప్‌ గన్‌, థండర్‌బర్డ్స్‌ వంటి హాలీవుడ్‌ మూవీలతో కొందరు నెటిజన్లు పోల్చారు. సైనిక అధికారులతో కిమ్‌ బయటకు వస్తున్న దృశ్యాలు 1983లో విడుదలైన ద రైట్‌ స్టఫ్‌లోని దృశ్యాల్లా ఉన్నాయంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కిమ్‌ తాజా వీడియోను దేశానికి మద్దతుగా ప్రచారం నిర్వహించే కార్యక్రమంలోనే భాగమే. ఉత్తర కొరియా ప్రజలను కొత్తగా, ఉత్తేజ పరిచేలా ఈ వీడియోను రూపొందించారు. దీంతో ఇటు దేశ పరువు ప్రతిష్ఠలు పెరగడంతో పాటు కిమ్‌ పేరు, ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయని భావించారు. ఇటీవల సన్నబడిన... కిమ్‌ను ఇందులో యాక్షన్‌ హీరో స్థాయిలో చూపించే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News