North Korea: మళ్లీ క్షిపణి పరీక్షలను మొదలుపెట్టిన ఉత్తరకొరియా

* మరోసారి చెలరేగిపోయిన ఉత్తర కొరియా * 1500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించిన అస్త్రాలు

Update: 2021-09-14 03:15 GMT

క్షిపణి పరీక్షలను మొదలుపెట్టిన కిమ్ (ఫోటో: కొరియన్ హెరాల్డ్)

North Korea: కొద్ది నెలల పాటు ప్రశాంతంగా ఉన్న ఉత్తర కొరియా మరోసారి చెలరేగిపోయింది. మళ్లీ క్షిపణి పరీక్షలను మొదలుపెట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి క్రూయిజ్‌ క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. అణ్వస్త్రాల అంశంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటూ పోతున్న తీరుకు ఇది దర్పణం పడుతోంది.

శని, ఆదివారాల్లో ఈ క్షిపణి పరీక్షలను జరిపినట్లు కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ అస్త్రాలు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని పేర్కొంది. ఒక లాంచర్‌ ట్రక్కు నుంచి వీటిని ప్రయోగిస్తున్న ఫొటోలను విడుదల చేసింది. ఈ క్షిపణులు చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధాలని ప్రకటించింది. దీన్నిబట్టి వీటిలో అణు వార్‌హెడ్‌లను అమర్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవలి పరీక్షల్లో రెండు క్షిపణులు రెండు గంటల పాటు ఉత్తర కొరియా గగనతలంలో ప్రయాణించి, నిర్దేశిత లక్ష్యాలను ఢీ కొట్టాయని కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ ఆయుధ వ్యవస్థల సమర్థతను ఇవి ధ్రువీకరించాయని పేర్కొంది.

Tags:    

Similar News