Coronavirus : ఉత్తర కొరియాలో రోగి కనిపిస్తే కాల్చివేత..
చైనా నుండి కరోనావైరస్ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఉత్తర కొరియా అధికారులు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు..
చైనా నుండి కరోనావైరస్ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఉత్తర కొరియా అధికారులు షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేసినట్లు దక్షిణ అమెరికా దళాల కమాండర్ (యూఎస్‌ఎఫ్) రాబర్ట్ అబ్రమ్స్ తెలిపారు. ఎవరికైనా కరోనా సోకిందని తెలిసిన వెంటనే వారిని కాల్చి చంపేయాలని ఉత్తర కొరియా స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కి ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆదేశాలు అందాయని ఆయన పేర్కొన్నారు. యూఎస్‌ఎఫ్‌కే కమాండర్ రాబర్ట్ వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆన్‌లైన్ సదస్సులో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో దరిద్రమైన ఆరోగ్య వ్యవస్థ నడుస్తోందని.. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి కష్టపడుతోందని కమాండర్ తెలిపారు. ఆ దేశానికీ ఉత్తరాన కీలక మిత్రదేశమైన చైనాలో మొదట ఉద్భవించి.
భారత్ బయోటెక్ తీపికబురు.. జంతువుల్లో సత్ఫలితాలిచ్చిన వ్యాక్సిన్
ఆ తరువాత ప్రపంచాన్ని కదిలించిన కరోనా మహమ్మారికి సంబంధించి.. ఉత్తరకొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.. రాబర్ట్ అబ్రమ్స్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వైరస్ భారిన పడి ఇక్కడ ఎంతమంది తుపాకీ తూటాకు బలయ్యారో అని అనుమానం కలుగుతోంది. కాలుష్యాన్ని నివారించడానికి అంటూ ప్యోంగ్యాంగ్ లో జనవరి నుంచి చైనా సరిహద్దును మూసివేసింది, జూలైలో మాత్రం అత్యవసర పరిస్థితిని విధించింది. కానీ ఒక వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పింది తప్ప, అధికారికంగా కొరియా నుంచి కరోనాపై ఎలాంటి సమాచారం లేదు. కాగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలు గత నాలుగునెలల కిందటే ఉత్తరకొరియాలో ఉన్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.