North Korea: అమెరికాను మళ్లీ కవ్వించిన కిమ్‌

North Korea: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన నార్త్‌ కొరియా

Update: 2022-09-25 08:06 GMT

North Korea: అమెరికాను మళ్లీ కవ్వించిన కిమ్‌

North Korea: శత్రు దేశాలను కవ్వించడానికి కాలుదువ్వే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ మళ్లీ అలాంటి పనే చేశాడు. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. టైకాన్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది.. 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన క్షిపణి 600 కిలోమీటర్ల దూరంలో పడింది. దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విన్యాసాలకు అమెరికా సిద్ధం కావడం, ఇంకొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు దక్షిణ కొరియాను సందర్శించనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణిని ప్రయోగించడం అమెరికాను రెచ్చగొట్టినట్లయ్యింది.

Tags:    

Similar News