Nobel Peace Prize: మమ్ముల్ని ఆశీర్వదించండి.. పెళ్లి ఫోటోల్ని పోస్ట్ చేసిన మలాలా
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు.
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. ఈ మేరకు మలాలా తన భాగస్వామి అస్సర్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని అస్సర్, తను జీవిత భాగస్వాములు అయ్యామని తెలిపింది. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం చేయడానికి సంతోషంగా ఉన్నామని మలాలా ట్వీట్ చేశారు.
24 ఏళ్ల మలాలా యూసఫ్‌జాయ్ బాలికల విద్య కోసం ఉద్యమించారు. 2012వ సంవత్సరంలో బాలికల విద్య ప్రాథమిక హక్కును సమర్థించినందుకు వాయువ్య పాకిస్థాన్‌లో తాలిబాన్లు మలాలా తలపై కాల్చడంతో ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. బ్రిటన్ దేశంలో చికిత్స పొందిన మలాలా అక్కడే స్థిరపడ్డారు. పాకిస్థానీ ఉద్యమకారిణి మలాలా అత్యంత చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. మలాలా పదహారేళ్ల వయసులోనే విద్యలో లింగ సమానత్వం ఆవశ్యకతపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు.