ఒమిక్రాన్ ఆంక్షలు.. ఏకంగా పెళ్లి రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని...
Jacinda Arden Wedding: కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నా మన దేశంతో నాయకులు వాటిని భేఖాతరు చేయడం చూస్తూనే ఉన్నాం
Jacinda Arden Wedding: కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నా మన దేశంతో నాయకులు వాటిని భేఖాతరు చేయడం చూస్తూనే ఉన్నాం కానీ ఓ దేశ ప్రధాని మాత్రం సామాన్యుడికైనా.. ప్రధానికైనా రూల్స్ ఒక్కటేనని చాటి చెప్పారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
న్యూజిలాండ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను విధించింది. వేడుకలను వ్యాక్సిన్ వేయించుకున్న 100 మందితో నిర్వహించుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్దెర్న్ తన స్నేహితుడు క్లార్క్ గేఫోర్డ్‌తో వివాహాన్ని చేసుకోవాలనుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న సన్నిహితుల్లో 9 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అందరికీ వర్తించే నిబంధనలే తనకూ వర్తిస్తాయని న్యూజిలాండ్ ప్రధాని జసిండా తెలిపారు.