నెట్‌ఫ్లిక్స్‌కు షాకిచ్చిన వినియోగదారులు.. 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయిన..
Netflix: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు వినియోగదారులు షాకిచ్చారు.
Netflix: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు వినియోగదారులు షాకిచ్చారు. 2 లక్షల మంది యూజర్లు యాప్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు దిద్దబాటు చర్యలకు ఉపక్రమించింది. వ్యాపార ప్రకటనలను ఇస్తూ తక్కువ ధరల్లో ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి వ్యాపార ప్రకటనలు లేకుండా కేవలం సినిమాలు, టీవీ షోలను మాత్రమే చూస్తున్న నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ఇక భారీ మార్పులే చూడడనున్నట్టు ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో నెట్‌ఫ్లిక్స్ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రీడ్ షేస్టింగ్స్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఓటీటీ దిగ్గజాలు డిస్నీ ప్లస్, హాట్ స్టార్, జీ5, ఎంఎక్స్‌ప్లేయర్ సంస్థలు ఇండియాలో యాడ్స్‌కు సపోర్టు చేస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా తన యాడ్ సపోర్ట్ స్ట్రీమింగ్ సర్వీసు మినీటీవీనిలో అందిస్తోంది.
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు దేశవ్యాప్తంగా 22 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ఇటీవల క్రమంగా వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. రెవెన్యూ గత త్రైమాజికంలో 9.8 శాతం పెరిగి.. కంపెనీ ఆదాయం 7పాయింట్ 87 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ప్రస్తుత త్రైమాజికంలో మాత్రం 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయినట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుత త్రైమాజికంలోనే మరో 20 లక్షల మంది వినియోగదారులను కోల్పోయే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. 2011 తరువాత అంత భారీ స్థాయిలో వినియోగదారులను కోల్పోవడం ఇదే తొలిసారి. అయితే దీనికి ఆర్థికాభివృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాలే వినియోగదారులను భారీగా కోల్పోవడానికి కారణమని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. రష్యాలోనూ సేవలను నిలిపేయడంతో అక్కడ 7 లక్షల మంది వినియోగదారులను కోల్పోయినట్టు ఆ సంస్థ తెలిపింది.