Nepal President: నేపాల్‌లో పార్లమెంట్ రద్దుతో ఆందోళనలు
Nepal President: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం పార్లమెంట్ రద్దుకు దారితీసింది.
Nepal President: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం పార్లమెంట్ రద్దుకు దారితీసింది. అధికార ప్రతిపక్షాలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడంతో ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 12,19 తేదీల్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. శుక్రవారం వరకు ప్రభుత్వ ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలు ఇచ్చిన గడువు ముగియగా అధికార, విపక్షాలు బలాన్ని నిరూపించుకోలేకపోయాయి. మరోవైపు పార్లమెంట్ రద్దును నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది. ప్రెసిడెంట్ బిద్యాదేవికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు నినాదాలు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.