Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు

Nepal: *రాళ్లదాడికి దిగిన ఆందోళనకారులు *టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించిన పోలీసులు

Update: 2022-06-21 12:15 GMT

Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు

Nepal: నేపాల్‌లో చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇంధన ధరల పెంపునకు నిరసనగా కర్రలకు నిప్పంటించుకుని విపక్షానికి చెందిన విద్యార్థి విభాగం ర్యాలీలను చేట్టింది. అయితే పోలీసులకు ఆందోలనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లను రువ్వారు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. తాజా దీంతో దేశ రాజధాని ఖాట్మాండులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని నేపాల్‌ పోలీసులు తెలిపారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో నేపాల్‌కు చమురు ఉత్పత్తులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగాయి. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయమైన నేపాల్‌లో కోవిడ్‌ కారణంగా పరిస్థితి పర్యాటకులు భారీగా తగ్గిపోయారు. ఫలితంగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. విదేశీ మారక నిధులు కొరత ఏర్పడింది. ఇప్పటికే విలువైన బంగారం, కార్ల దిగుమతిని నేపాల్‌ ప్రభుత్వం నిషేధించింది. గత్యంతరంలేక తాజాగా పెట్రోలు ధరలను పెంచింది. లీటరు పెట్రోలుపై తాజాగా 21 నేపాలీ రూపాయలు, డీజిల్‌, కిరోసిన్‌పై 27 రూపాయలను పెంచింది. దీంతో లీటరు పెట్రోలు ధర 199 రూపాయలకు చేరుకోగా డీజిల్‌, కిరోసిన్‌ ధర 192 రూపాయలయ్యింది.

పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే అమలు చేసింది. పెట్రోలు ధరలను పెంచడంపై ప్రతిపక్ష పార్టీ నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ-యూఎంఎల్‌ అనుబంధ విద్యార్థి సంఘం ఆల్‌ నేపాల్‌ ఫ్రీ స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాజధానిలో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే నేపాల్‌లో ఇటీవల ఆహార, చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం 7.87 శాతానికి పెరిగింది. దీంతో 2 కోట్ల 90 మంది ప్రజలపై దీని ప్రభావం పడుతోంది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణాసిలోని శ్రీలంక, పాకిస్థాన్‌ తరువాత నేపాల్‌ ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఆ దేశంలో పరిస్థితులు ఇప్పటికే ఆందోళనకరంగా మారింది. 

Tags:    

Similar News