గ్రహాంతర వాసులపై నాసా క్లియర్ కట్ ఎవిడెన్స్.. అంగారక గ్రహంపై ఆ ముద్రల హిస్టరీ ఏం చెబుతోంది?
NASA: ఏలియన్స్.. ఈ పేరు విన్న ప్రతిసారి ప్రపంచంలో అంతులేని ఉత్కంఠ కనిపిస్తోంది.
NASA: ఏలియన్స్.. ఈ పేరు విన్న ప్రతిసారి ప్రపంచంలో అంతులేని ఉత్కంఠ కనిపిస్తోంది. గ్రహాంతర వాసుల గురించి ఏ చిన్న అప్‌డేట్ అయినా అంతే ఆసక్తి రేపుతుంది. ప్రధానంగా అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ నాసా ఈ పరిసోధనల్లో ముందుంటుంది. ఏలియన్స్ ఉన్నాయని, మనలాగే మరిన్ని గ్రహాలు జీవకోటికి ఆవాలమనీ నాసా బలంగా నమ్ముతుంది. ఇందుకోసం రాత్రీ, పగలు తేడా లేకుండా అలుపెరుగని పరిశోధనలు చేస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా ఇదే నాసా సైంటిస్టులు ఏలియన్స్ ఉనికిపై ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఏలియన్స్ ఉన్నారనడానికి ఇదో ఎవిడెన్స్ కావచ్చంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది మళ్లీ ఏలియన్స్‌పై ప్రపంచంలో భారీ చర్చ మొదలైంది. ఇంతకూ గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారా..? ఏలియన్స్ ఉన్నాయనేందుకు నాసా దగ్గరున్న ఎవిడెన్స్ ఏంటి..?
మన కళ్లకు కనిపించేవన్నీ నిజం కాదు.. అలా అని కనిపించనివన్నీ అబద్ధాలూ కాదు. ఈ మాట ఏలియన్స్ ఉన్నారా లేదా అనే ప్రశ్నకు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. హాలీవుడ్ సినిమాల ప్రభావంతో ఏలియన్స్‌పై చర్చ ఇప్పుడు కాదు, ఎప్పుడో షురూ అయిపోయింది. భూమిలాగే మరిన్ని గ్రహాలు ఉంటాయనీ, వాటిలోనూ జీవరాసుటుందన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చే. హాలీవుడ్ సినిమాల పుణ్యమా అని త్వరలో భూమిని గ్రహాంతర వాసులు ఆక్రమించుకుంటారనే భయాలూ మనుషుల్లో భారీగానే పెరిగిపోయాయి. ఇలాంటి అంతేలేని చర్చతో ఏలియన్స్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రపంచం అలర్ట్ అయిపోతుంది. అర్జెంట్‌గా ఏలియన్స్‌కు గురించి తెలుసుకోవాలనే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేస్తుంది. అయితే, అనంతవిశ్వంలో ఎన్నో అంశాల్లానే ఈ ఏలియన్ సబ్జెక్ట్ కూడా ఎప్పటికీ పూర్తిగా తేలని పంచాయితీనే.
మన ఊహకు అందనివాటిని అతీత శక్తులుగా ఆపాదించడం అనాదిగా వస్తున్నదే. ధ్వంసమైన చీకటి చరిత్రలోని శకలాలను ఇప్పటికీ ఊహించలేకుండా ఉన్నాం. ఈజిప్ట్‌లోని పిరమిడ్ నిర్మాణం, పిరమిడ్ల చుట్టూ అనేక ఊహాగానాలే ఇందుకు ఉదాహరణగా చెబుతారు. వీటితోపాటు ప్రపంచంలోని ఎన్నో కట్టడాలు, ఆకృతుల వివరాలు నేటికీ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిలో చాలా వాటిని గ్రహాంతరవాసులతో ముడిపెట్టే కథనాలు బోలెడు. ఇందులో దేనినీ ఒకే మాటలో కొట్టివేయడం సాధ్యపడకపోవచ్చు. కానీ, గ్రహాంతరవాసులపై చర్చ మాత్రం నిరంతరం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. తాజాగా, మరోసారి ఈ చర్చ నాసా విడుదల చేసిన అంగారకుడిపై ఓ పాద ముద్ర ఫొటోతో మళ్లీ మొదలైంది. చూడడానికి ఆ ఫొటో ఏలియన్ పాదముద్రలా ఉందని నెటిజన్లు కామెట్లు చేస్తున్నారు. దాదాపుగా ఐదు లక్షల మంది ఈ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోను లైక్ చేశారు. అందులో అత్యధిక మంది అభిప్రాయం అది ఏలియన్ ఫుట్ ప్రింట్ అన్నదే. అయితే నాసా మాత్రం అది ఓ జీవి పాద ముద్ర అని చెప్పడం లేదు. మార్స్‌పై ఫోటో తిసిన ప్రాంతంలో ఉన్న ఓ ఆకారంగానే చెబుతోంది.
ఈ ఫొటోపై చర్చ ఇలా కొనసాగుతుండగానే.. ఏలియన్స్ ఉనికిపై అమెరికా వరుస ప్రకటనలకు దిగుతోంది. 2014లో భూమిని ఢీ కొట్టిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్‌గా యూఎస్ స్పేస్ కమాండ్ ధృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్ సైతం ప్రకటన చేయడం ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా క్యాప‍్చర్ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేయగా నెటిజన్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. అయితే, ఈ ఫొటో నిజంగానే ఏలియన్స్‌కు సంబంధించిందా.? కాదా అనే దానిపై నాసా క్లారిటీ ఇవ్వడంలేదు.
మరోవైపు.. 2017లో భూమిని తాకిన ఓ శకలాన్ని.. 'ఒయూమువామువా'గా నామకరణం చేసింది నాసా. సాంకేతిక పరిశోధనలతో అది నక్షత్రాల మధ్య ఆబ్జెక్ట్‌గా తేలింది. అయితే అంతకంటే ముందే 2014 జనవరిలో భూమిని తాకిన ఉల్కనేు కూడా ఇంటర్ స్టెల్లర్ అబ్జెక్టుగానే ధృవీకరించింది అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ నాసా. మరో సౌర వ్యవస్థ నుంచి దూసుకొచ్చిన ఈ స్పేస్ రాక్‌ను హార్వార్డ్ ఖగోళ పరిశోధకులు అమీర్ సిరాజ్, అబ్రహం లియోబ్‌లు పరిశోధనలు జరిపి.. ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్‌గా నిర్ధారించారు. దీంతో 2017లో భూమిని తాకిన 'ఒయూమువామువా'ను రెండో ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్‌గా తేల్చినట్లయింది.
నక్షత్రాల మధ్య శకలాలను ఇంటర్ స్టెల్లర్ అబ్జెక్ట్స్‌గా చెబుతారు.. గ్రహాంతర జీవుల ఉనికిని ఇవి ఇతర ప్రాంతాలకు మోసుకెళ్తాయని నాసా సైంటిస్టులు నమ్ముతారు. ఇంటర్ స్టెల్లర్ మెటోర్స్ అనేవి ఇతర గ్రహాల వ్యవస్థ, అక్కడి ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు విశ్వంలో జీవరాశి గురించి తెలియజేసేందుకు మధ్యవర్తిత్వం లాగా అవి పని చేస్తాయని నాసా సైంటిస్ట్ అబ్రహం లోయిబ్ అంటున్నారు. అయితే.. 2014 ఉల్క సంగతి ఏమోగానీ.. ఒయూమువామువా మాత్రం ఆస్టరాయిడ్ అనడం కంటే.. ఏలియన్ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుగా దాదాపు నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. హాలీవుడ్‌లో ఇంటర్ స్టెల్లర్ మూవీ రిలీజ్ అయిన అదే ఏడాది ఈ ప్రకటన చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇదంతా ఒకెత్తయితే ఏలియన్స్‌పై కచ్చితమైన అంచనాలతో నాసా తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతోంది. ఏలియన్స్ ఉన్నాయని చెప్పడమే కాదు దాదాపు 5వేల గ్రహాల్లో వీటి ఉనికి ఉందని కుండబద్దలు కొడుతోంది. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా చెబుతోంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు 2018 ఏప్రిల్‌లో నాసా ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం 5వేల గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన్నట్లు తెలిపింది. వాటిల్లో 176వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. అయితే ఒక్క 2021 ఏడాదిలోనే మొత్తం 2400గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ శాటిలైట్ గుర్తించిందని తెలిపారు.
ఇక నాసా శాటిలైట్ TESS గుర్తించిన 5వేల బాహ్యగ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు, వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు. TESS ఉపగ్రహం.. ఖగోళ వస్తువును కనిపెట్టి.. దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండడంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఇక TESS కంటే ముందు బాహ్యగ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్లెర్ టెలిస్కోప్.. 2000 ఖగోళ వస్తువులను కనుగొన్నా.. అవేవి.. గ్రహాలుగా నిర్ధారించబడలేదు. TESS కనిపెట్టిన ఒక గ్రహంపై ఏడాది కాలం.. భూమిపై 16 గంటలకే ముగుస్తున్నట్లు నాసా చెబుతోంది.
మొత్తంగా TESS శాటిలైట్ పనితీరుపై నాసా సైంటిస్టులకు నమ్మకం కుదిరింది. అందుకే రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన TESS శాటిలైట్ సేవలను మరో మూడేళ్ళ పాటు వినియోయోగించుకోవాలని నాసా పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందని మాత్రమే అంచనా వేశామని.. కానీ నిర్ధారణ చేయలేదని నాసా చెబుతోంది. ఇదే సమయంలో ఏలియన్స్ ఉన్నాయనేదానికి త్వరలోనే ఆధారాలు సేకరిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తంగా నాసా ఏలియన్స్ ప్రకటనతో రానున్న రోజుల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. నిజంగానే ఏలియన్స్ ఉండి భూగ్రహంమీదకు వస్తే ఏం జరుగుతుందో చూడాలి.