Vladimir Putin: మోదీ, జిన్ పింగ్ లపై రష్య అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Vladimir Putin: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ,భారత ప్రధాని నరేంద్ర మోదీలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు
Vladimir Putin: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ,భారత ప్రధాని నరేంద్ర మోదీలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోదీ, జిన్ పింగ్ బాధ్యత కలిగిన నేతలని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను వారిద్దరే పరిష్కరించుకోగలరని పుతిన్ అన్నారు. ఆ ప్రక్రియలో వేరే ఏ దేశమూ జోక్యం చేసుకోకూడదని సలహా ఇచ్చారు.
కాగా.. క్వాడ్ గ్రూప్ (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన బృందం)కు ముందు నుంచీ వ్యతిరేకంగానే ఉన్న పుతిన్.. ఓ దేశం ఎలా ఆ గ్రూప్ లో ఉంటుందో.. బంధాలను బలపరుచుకునేందుకు అది ఎంత వరకు ఉపయోగపడుతుందో తాము ఏనాడు ఆలోచించలేదని అన్నారు. క్వాడ్ గ్రూప్ లో భారత్ ఉన్నంత మాత్రాన.. భారత్ తో తమ సంబంధాలేమీ దెబ్బతినవని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక రంగం, ఇంధనం, హైటెక్, రక్షణ తదితర అన్ని అంశాల్లోనూ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు.
స్పందించారు.అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, టెక్నాలజీల తయారీలో తమకు ఒకే ఒక్క భాగస్వామి భారత్ అని ఆయన స్పష్టం చేశారు.రష్యా, చైనా మధ్య బలపడుతున్న బంధమూ భారత్ పై ప్రభావం చూపబోదని తేల్చి చెప్పారు. తమ ఇద్దరి మధ్యా పరస్పర విశ్వాసం ఉందని, దాని వల్లే భారత్, రష్యా మధ్య సంబంధాలు వేగంగా, విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.