Mystery Elephant Deaths: రెండు నెలల్లో 350కిపైగా ఏనుగులు మిస్టరీస్ డెత్..
Mystery Elephant Deaths: రెండు నెలల కాలంలో 350కి పైగా ఏనుగులు మృత్యువాత పడ్డ ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో చోటుచేసుకుంది.
Mystery Elephant Deaths: రెండు నెలల కాలంలో 350కి పైగా ఏనుగులు మృత్యువాత పడ్డ ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో చోటుచేసుకుంది. అయితే ఇన్ని ఏనుగులు ఎందుకు మృతి చెందాయని విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇది దక్షిణాఫ్రికా ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే యుకేకు చెందిన ఛారిటీ నేషనల్ పార్కు రెస్క్యూకు చెందిన డాక్టర్ నియాల్ మక్కాన్ మే నెల ప్రారంభంలో ఒవావాంగో డెల్టా ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు. ఆయన ఏనుగులు మృతి చెందిన విషయాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. అయితే మే నెలలో ఏనుగులు చనిపోవడానికి వేటగాళ్లే కారణమని మొదట భావించారు. దాదాపు మూడు గంటల పాటు చేసిన విమాన ప్రయాణంలో అధిక సంఖ్యలో ఏనుగులు అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. అనంతరం నెల రోజుల తర్వాత చేసిన పరిశోధనలో మరికొన్ని ఏనుగు మృతదేహాలను గుర్తించారు.బొస్ట్వానా ప్రాంతంలో 350కి పైగా ఏనుగు మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి.
సౌత్ ఆఫ్రికాలో కరువు ఛాయలు లేనప్పటికీ ఇంత భారీ స్థాయిలో ఏనుగులు మృతువాత పడడం ఆశ్చర్యాన్ని కలగిస్తోంది. వేగాళ్లు ఏనుగులను చంపి వుంటారని భావించిన ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ఏనుగుల నుంచి దంతాలను తొలగించలేదు. దీంతో మరేదో కారణమై ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. అయితే బోస్ట్వానా ప్రాంతంలో ఏనుగులు మాత్రమే చనిపోతున్నాయి. వేరే జంతువులు చనిపోవడం లేదని, వేటగాళ్ల ఉపయోగించే సైనైడ్ అయితే ఇతర జంతువులు చనిపోయా ఉండాలని, కానీ అలా జరగలేదని డాక్టర్ నియాల్ మక్కాన్ వివరించారు. గతేడాది బోస్ట్వానాలోనే ఆంత్రాక్స్ వ్యాధి సోకి వందకుపైగా ఏనుగులు చనిపోయాయి. ఏనుగులకు కరోనా వైరస్ సోకి చనిపోయి ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బొస్ట్వానా వన్యప్రాణి, జాతీయ ఉద్యాన వనాల డైరెక్టర్ డాక్టర్ సిరిల్ టావోలో గార్డియన్ దీనిపై స్పందిస్తూ... 280 ఏనుగులు ఇప్పటివరకు చనిపోయినట్టు గుర్తించామని, మిగిలిన వాటిని గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. అయితే ఏనుగుల మరణానికి కారణం ఏంటి అనేది ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. అయితే, ఇప్పటికే ఏనుగుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించామని, రాబోయే రెండు వారాల్లో ఏనుగుల మరణానికి కారణం తెలుస్తుందనీ బొస్ట్వానా వన్యప్రాణి, జాతీయ ఉద్యాన వనాల డైరెక్టర్ డాక్టర్ సిరిల్ టావోలో గార్డియన్ వెల్లడించారు.