కరోనా కాటుకు బలైన మంత్రి..

పాకిస్థాన్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,132 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం 80,4639 కేసులు నమోదయ్యాయి.

Update: 2020-06-03 07:39 GMT
Representational Image

పాకిస్థాన్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,132 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం 80,4639 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1688 మంది మరణించారు అని పాకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనాకు సింధ్ ప్రావిన్స్ రాష్ట్రము ఎక్కువగా ప్రభావితమైంది. ఇక్కడే 31 వేలకు పైగా కేసులు నిర్ధారించబడ్డాయి. ఆ తరువాత పంజాబ్ 29,489, ఖైబర్-పఖ్తున్ఖ్వా 10,897, బలూచిస్తాన్ 4,747, ఇస్లామాబాద్ 3,188, గిల్గిట్-బాల్టిస్తాన్ 779 మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలో 289 మంది రోగులను గుర్తించారు.

గత 24 గంటల్లో మొత్తం 67 మంది రోగులు మరణించారు, దాంతో మరణాల సంఖ్య 1,688 గా ఉంది. మరో 28,923 మంది ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు సింధ్‌ రాష్ట్రంలో ఒక మంత్రి కరోనా కారణంగా మరణించారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌ కు చెందిన మంత్రి హాజీ గులాం ముర్తాజా బలూచ్ గత నెలలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ భారిన పడ్డారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News