చైనాకు మరో భారీ ఎదురు దెబ్బ..

అమెరికా, ఇండియా వాణిజ్యపరంగా స్ట్రైక్ చెయ్యడంతో సతమతమవుతోన్న చైనాకు మరో ఎదురుదెబ్బ..

Update: 2020-09-04 14:01 GMT

అమెరికా, ఇండియా వాణిజ్యపరంగా స్ట్రైక్ చెయ్యడంతో సతమతమవుతోన్న చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జపాన్ తయారుదారుల పెట్టుబడులు చైనా నుంచి వెనక్కి తీసుకోవాలని జపాన్ నిర్ణయించింది. తమ వాళ్ళు ఉత్పత్తులను చైనానుంచి ఇతర ఆసియా దేశాలకు తరలించేందుకు గాను ఉత్పత్తిదారులకు సబ్సిడీలు ఇవ్వాలని జపాన్ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. లేనిచో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామని జపాన్ అల్టిమేటం జారీ చేసింది. జపాన్ తయారీదారులు చైనాలో ఉత్పత్తిని భారతదేశం లేదా బంగ్లాదేశ్ కు చైనా పంపించినట్టయితే సబ్సిడీలకు తమ ఉత్పత్తిదారులు అర్హులని ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఆగ్నేయాసియా దేశాలకు ఉత్పత్తిని తరలించే సంస్థలకు 2020 ఆర్థిక సంవత్సరానికి జపాన్ అనుబంధ బడ్జెట్ 23.5 బిలియన్ లను కేటాయించిన విషయం తెలిసిందే.అంతేకాదు అత్యవసర పరిస్థితులలో కూడా వైద్య సామగ్రి, ఎలక్ట్రానిక్ భాగాల స్థిరమైన సరఫరాను అందించే వ్యవస్థను కూడా నిర్మించాలని జపాన్ భావిస్తోంది. ఇప్పటికే అమెరికా, భారత్ లో చైనాకు చెందిన కంపెనీలకు భారీగా నష్టం వాటిల్లింది. 

Tags:    

Similar News