పోరాడి ఓడిన రిషి సునక్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్..

Britain Next Prime Minister: ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు.

Update: 2022-09-06 01:45 GMT

పోరాడి ఓడిన రిషి సునక్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్..

Britain Next Prime Minister: ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పై లిజ్ ట్రస్ భారీ ఆదిక్యంతో విజయం సాధించారు. ఈ సందర్భంగా తమ నాయకురాలిగా లిజ్ ట్రస్ ను కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది. రిషి సునక్ పై 21 వేల ఓట్ల ఆధిక్యంతో లిజ్ విక్టరీ కొట్టారు. లిజ్ ట్రస్ కు 81 వేల 326 ఓట్లు రాగా రిషి సునక్ కు 60 వేల 399 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బోరిస్ జాన్సన్ స్థానంలో లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత ప్రారంభంలో రిషి సునాక్ ముందంజలో దూసుకెళ్లారు. ఎంపీల్లో ఎక్కువ మద్దతు ఆయనకే లభించింది. విదేశాంగ మంత్రి ట్రస్ కు టోరి ఎంపీల మద్దతు తక్కువనే చెప్పవచ్చు. ఆ సమయంలో ట్రస్ రెండో స్థానంలో నిలిచారు. అయితే, పార్టీ సభ్యులు వేసే ఆన్ లైన్ , పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ట్రస్ కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. అధికారంలోకి వస్తే వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్ ట్రస్ పేర్కొనడమే ఆమె ముందంజకు కారణమని చెబుతున్నారు. 

Tags:    

Similar News