Julian Assange: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన వికీలిక్స్ జులియన్ అసాంజే
Julian Assange: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు సోమవారం లండన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఐదేళ్ల పాటు జైలులో ఉన్న అసాంజే విడుదలపై వికీలీక్స్ సంతోషం వ్యక్తం చేసింది. అసాంజే ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడంటూ ట్వీట్ చేసింది.
Julian Assange: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించినట్లయ్యింది. లండన్ జైలు నుంచి ఆయన సోమవారం రిలీజ్ అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు అసాంజే నేరం ఒప్పుకున్నారని..ఈ మేరకు జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిన్ మీద రిలీజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5ఏండ్ల తర్వాత స్వేచ్ఛ వాయువు పీల్చిన అసాంజే..సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి కూడా లభించినట్లు సమాచారం.
ఇక అసాంజే విడుదలను వికీలిక్స్ కూడా ఎక్స్ ద్వారా ద్రవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన ట్వీట్ ను పోస్టు చేసింది. జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి..జైలు 1901 రోజులు గడిపారు. జూన్ 24న ఉదయం ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. లండన్ హైకోర్టు అసాంజేకు బెయిల్ ఇచ్చింది. అక్కడి నుంచి ఆయన స్టాన్ స్టెడ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారంటూ వికీలిక్స్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ఇక అసాంజే జైలు నుంచి విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలిక్స్ కృతజ్ఞతలు తెలిపింది. అయితే అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం జరిగిందని ధ్రువీకరించిన వికీలిక్స్...ఆ ఒప్పందానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
2010లో, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్‌లలో జరిగిన యుద్ధాల సమయంలో వికీలీక్స్ వేల సంఖ్యలో అమెరికా సైనిక పత్రాలను విడుదల చేసింది. అమెరికా సైనిక చరిత్రలో ఇది అతిపెద్ద భద్రతా ఉల్లంఘన. దౌత్య తంతులు, యుద్దభూమి ఖాతాలను కలిగి ఉన్న 700,000 పత్రాలు ఉన్నాయి. అసాంజేపై వచ్చిన ఆరోపణలు అతని ప్రపంచ మద్దతుదారులలో సహా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. చాలా మంది పత్రికా స్వేచ్ఛ న్యాయవాదులు అసాంజేపై నేరారోపణలను 'స్వేచ్ఛకు ముప్పు'గా అభివర్ణించారు. నేరం రుజువు కావడంతో జూలియన్ అసాంజే జైలుకు వెళ్లాడు. ఐదేళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన సోమవారం విడుదలయ్యాడు.