Joe Biden-PM Modi: ప్రధాని మోదీకి జోబైడెన్ ఫోన్.. వచ్చేనెలా అమెరికాకు మోదీ?

Joe Biden-PM Modi:అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. బంగ్లాదేశ్‌లో హింస, ఉక్రెయిన్-రష్యా యుద్ధం సహా పలు అంశాలపై ఇరువురు నేతల మధ్య సవివరమైన చర్చ జరిగినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. కాగా ప్రధాని మోదీ వచ్చేనెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

Update: 2024-08-26 19:01 GMT

Joe Biden-PM Modi: ప్రధాని మోదీకి జోబైడెన్ ఫోన్.. వచ్చేనెలా అమెరికాకు మోదీ?

Joe Biden-PM Modi: ప్రపంచం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ యుద్దం..మరోవైపు బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత కూడా కొనసాగుతూన్న హింస. ఈ వాతావరణం మధ్య సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జోబిడెన్...భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేవారు. రష్యా -ఉక్రెయిన్, బంగ్లాదేశ్ సమస్యలను చర్చించినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఉక్రెయిన్, బంగ్లాదేశ్ పరిస్థితులపై ప్రధాని మోదీ, జో బిడెన్ మధ్య చర్చ జరిగినట్లు పేర్కొంది.

జో బిడెన్‌తో తన సంభాషణలో భాగంగా.. ప్రధాని మోదీ బంగ్లాదేశ్ హిందువులపై హింసను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ప్రధాని మోదీనే స్వయంగా తాను సోమవారం జో బిడెన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులతో పాటు వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావడానికి భారతదేశం పూర్తి మద్దతును ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. జో బిడెన్‌తో తాను బంగ్లాదేశ్‌లో పరిస్థితిని కూడా చర్చించానని, బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతను నిర్ధారించడం, సాధారణ స్థితిని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

భారతదేశం-అమెరికా భాగస్వామ్యం పట్ల ప్రెసిడెంట్ బిడెన్ నిబద్ధతను ప్రధానమంత్రి ప్రశంసించారు. భారత్-అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలతో పాటు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరువురు నేతలు తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటన గురించి అధ్యక్షుడు జో బిడెన్‌కు తెలియజేశారు. సంభాషణ, దౌత్యానికి అనుకూలంగా భారతదేశం స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించారు. క్వాడ్‌తో సహా బహుపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News