Joe Biden: అమెరికా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జో బైడెన్

Joe Biden: అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన లేఖ రాస్తూ ప్రకటించారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Update: 2024-07-22 00:25 GMT

Joe Biden: అమెరికా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జో బైడెన్

Joe Biden:అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికర మలుపు తిరిగాయి. జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన లేఖ రాస్తూ ప్రకటించారు. అమెరికా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిడెన్ తెలిపారు. త్వరలో జాతిని ఉద్దేశించి ఆయన తన నిర్ణయంపై వివరంగా మాట్లాడనున్నారు.నామినేషన్‌ను ఆమోదించకూడదని..నా మిగిలిన పదవీకాలానికి అధ్యక్షుడిగా నా బాధ్యతలపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాను అని ఆయన రాశారు. 2020లో పార్టీ అభ్యర్థిగా నా మొదటి నిర్ణయం కమలా హారిస్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం.. ఇది నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని లేఖలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం కమలని మా పార్టీ అభ్యర్థిగా చేసినందుకు ఈ రోజు నేను ఆమెకు నా పూర్తి మద్దతు అందించాలనుకుంటున్నాను అని తెలిపారు. ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం వచ్చిందన్నారు బైడెన్.

గత కొన్నాళ్లుగా జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య కారణాల రీత్యా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే చర్చ సాగిన నేపథ్యంలో బైడెన్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఎట్టకేలకు ఆదివారం ఈ ఊహాగానాలకు స్వస్తి పలికి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో బిడెన్ బలహీనంగా కనిపించారు.ఈ పరిస్థితుల్లో బిడెన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకోవాలని తీవ్రమైన ఊహాగానాలు వచ్చాయి.

ఇక దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన తర్వాత ట్రంప్ స్పందించారు. కమలా హారిస్ అభ్యర్థి అయితే తాను మరింత ఈజీగా ఓడిస్తానని స్పష్టం చేశారు.


Tags:    

Similar News