Yahya Sinwar: హమాస్‌కు చావు దెబ్బ.. అధినేత యహ్యా సిన్వార్ హతం..ధ్రువీకరించిన ఇజ్రాయెల్
Yahya Sinwar: ఈనెల 7వ తేదీన జరిగిన ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ అధినేత సిన్వార్ హతమైనట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.
Yahya Sinwar: ఇజ్రాయెల్ తో జరుగుతున్న పోరులో హమాస్ కు చావు దెబ్బ తగిలింది. హమాస్ అధినేత యహ్వా సిన్వర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. డీఎన్ఏ ఆధారంగా సిన్వర్ మరణించినట్లు నిర్ధారించామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఐడీఎఫ్ దళాల చేతిలో సిన్వార్ మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల కుటుంబాలకు ఈ విషయాన్ని తెలపాలని తన సిబ్బందికి సూచించారు. ఇజ్రాయెల్ అక్టోబర్ 7వ తేదీ నాటి ఘటనకు ఇతనే సూత్రధారి. ఆ ఘటనలో హమాస్ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్ వాసులను చాలా దారుణంగా హతమార్చారు. అప్పటి నుంచి సిన్వార్ కోసం ఇజ్రాయెల్ వేట షురూ చేసింది.
గాజాపై నిర్వహించిన దాడుల్లో ముగ్గురు హమాస్ మిలిటెంట్లు మరణించినట్లు ఇజ్రాయెల్ ఈ రోజు ప్రకటించింది. దాడి జరిపిన సమయంలో మిలిటెంట్లు ఉన్న భవనంలో బందీలు ఎవరూ లేనట్లు తెలిపింది. అయితే మరణించిన వారిలో సిన్వార్ ఉన్నాడా లేదా అనేది అప్పుడు నిర్ధారణ కాలేదు. డీఎన్ఏ టెస్టులోమరణించింది సిన్వార్ అని తేలినట్లు ఇజ్రాయెల్ ప్రకటన చేసింది.
సిన్వార్ న్వార్ ఎవరు?
యాహ్యా అసలు పేరు. యహ్యా ఇబ్రహీం హస్సన్ సిన్వార్. 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ లోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. అతని పూర్వీకులు 1948 వరకు నేటి దక్షిణ ఇజ్రాయెల్ లోని అష్కెలోన్ లో ఉండేవాళ్లు. అప్పట్లో ఈ ప్రదేశం ఈజిప్ట్ ఆధీనంలో ఉంటుండేది. ఆ తర్వాత సిన్వార్ కుటుంబం గాజాకు వెళ్లింది. అతను గాజా యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్ లో డిగ్రీ చేశాడు. సిన్వార్ రెండు దశాబ్దాల పాటు జైల్లో గడిపాడు.
1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరంతో మొదటిసారిగా అరెస్టయ్యాడు. 1985లో జైలనుంచి విడుదలయ్యాడు. మరొకరితో కలిసి మజ్ద్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్త ఏర్పాటైనా హమాస్ లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూనే ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకున్న వారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్వార్ 1988లో అరెస్టు అయి 1989లో అతనికి జీవిత ఖైదు విధించారు.
ఎన్నో సార్లు జైలు నుంచి తప్పించుకుని పారిపోయి దొరికాడు. 2008లో సిన్వార్ కు మెదడులో కణితి రావడంతో చికిత్స చేశారు. 2011లో ఇతని జీవితంలో కీలక పరిణామం ఎదురైంది. 2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ మొత్తం 1026 మందిని జైలు నుంచి రిలీజ్ చేసింది.
అందులో సిన్వార్ కూడా ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక వేగంగా ఉన్నతస్థానానికి చేరుకున్నాడు. మిలిటరీ వింగ్ లో కీలక పాత్ర పోషించాడు. 2015లో సిన్వార్ అమెరికా విదేశాంగశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. హమాస్ లోని అల్ కస్సామ్ బ్రిగేడ్ల ఏర్పాటునకు ముందున్న సంస్థను సిన్వార్ ఏర్పాటు చేసినట్లు అమెరికా తెలిపింది. 2017లో అతను గాజాలోని హమాస్ కు అధిపతిగా ఎన్నికయ్యారు.