Iran- America: ఇరాన్ పై కన్నెర్ర చేసిన అమెరికా.. 16 చమురు కంపెనీలపై ఆంక్షల కొరడా

Iran- America: ఇరాన్ పై అమెరికా ఆంక్షలు కొరడా ఝులిపించింది. ముఖ్యంగా ఇరాన్ తాజాగా ఇజ్రాయిల్ పై మిస్సైళ్లతో ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను బ్లాక్ లిస్టులో పెడుతూ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరాన్ ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ అంశంలో భాగంగా ఇరాన్ కు చెందిన 16 చమురు కంపెనీలను, 17 చమురు నౌకలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది.

Update: 2024-10-12 06:55 GMT

ఈ నేపథ్యంలో ఇరాన్ పై విధించిన ఆంక్షలు అటు ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపించనున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. అంతేకాదు చమురు సరఫరా లో కూడా ఇరాన్ ది కీలక స్థానం. పెట్రో కెమికల్ ఉత్పత్తులు, పెట్రోల్ ఎగుమతుల్లో కూడా ఇరాన్ ముందు స్థానంలోనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన ఈ ఆంక్షలుతో, నాటో దేశాలు ఇరాన్ తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేసే ప్రమాదం ఉంది.

అటు అమెరికా ఆంక్షల కారణంగా భారత్, చైనా వంటి అతి పెద్ద దిగుమతి దారులుగా ఉన్నాయి. దీంతో ఈ దేశాలు ఇరాన్ తో వాణిజ్య సంబంధాలపై పునరాలోచనలో పడే అవకాశం ఉంటుంది. భారత్ చమురు దిగుమతుల్లో ఇరాన్ దే అగ్రస్థానంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఇరాన్ నుంచి చమురు దిగుమతులను చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

అయితే భారత్ అమెరికా నాటో కూటమిలో భాగస్వామి కాదు. కనుక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో రష్యాపై కూడా అమెరికా ఆంక్షలు విధించినప్పుడు, రష్యా నుంచి భారత్ అతి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. అటు చైనా కూడా గతంలో అమెరికా ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య సంబంధాలను కొనసాగించింది. చైనా రష్యా మధ్య ఇప్పటికీ వాణిజ్య బంధం బలంగానే ఉంది.

ఇరాన్ తో కూడా చైనాకు మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ లోని చాబాహార్ పోర్టు, చైనాకు అత్యంత కీలకమైనది. అలాగే భారత్ కూడా చాబహార్ పోర్టు ద్వారా చమురు దిగుమతులను పెద్ద ఎత్తున చేసుకుంటుంది. మరి అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిన అవకాశం ఉంది. అయితే గల్ఫ్ సంక్షోభం మరికొంత కాలం సాగినట్లయితే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని మధ్య మార్గం సూచించాలని ఈ సందర్భంగా పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News