Iran Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ హీబ్రూ X అకౌంట్ రద్దు... లాస్ట్ పోస్ట్ ఏంటంటే
Iran Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ఎలాన్ మస్క్ భారీ షాకిచ్చాడు. ఖమేనీ ఎక్స్ అకౌంట్ ను సస్పెండ్ చేశారు. ఇరాన్ పై దాడుల అనంతరం ఇజ్రాయెల్ పై ఆయన ఓ పోస్టు చేశారు. అదే చివరి పోస్టు.
Iran Supreme Leader: ఇరాన్ పై గతవారం ఇజ్రాయెల్ జరిపిన దాడులతో పశ్చిమాసియాలో ఉద్రికత్త పరిస్థితులు నెలకున్నాయి. ఆ దాడుల్లో టెహ్రాన్ కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ తన సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ ను బెదిరిస్తూ ఖమేనీ ఈ పోస్టు చేయడంతో ఆ అకౌంట్ ను రెండు రోజులకే ఎక్స్ సస్పెండ్ చేసింది.
ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గత శనివారం ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంట్లో ఖమేనీ హిబ్రూ భాషలో ఎక్స్ అకౌంట్ ను తెరిచారు. అందులో ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇస్తూ పోస్టు చేశారు. ఇరాన్ ను తక్కువ అంచనా వేసి జియోనిస్టు పాలన తప్పు చేసింది.
ఇరాన్ కు ఎలాంటి శక్తి, సామర్ధ్యం, చొరవ, కోరిక ఉందో మేము చూపిస్తామంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ అకౌంట్ ను మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ ఆదివారం రాత్రి సస్సెండ్ చేసింది. అయితే ఖమేనీ పేరుతో ఉన్న మరో అధికారిక అకౌంట్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.