iPhone 16: అక్కడ ఐఫోన్ 16 నిషేధం..తలలు పట్టుకుంటున్న టూరిస్టులు

iPhone 16: ఈమధ్యే విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 16పై ఇండోనేషియా నిషేధం విధించింది. యాపిల్ పెట్టుబడి హామీలను నెరవేర్చలేదని ప్రభుత్వం ఆరోపించింది. దీని కారణంగా ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న టూరిస్టులకు పెద్ద సమస్యగా మారింది.

Update: 2024-10-26 04:25 GMT

iPhone 16

iPhone 16: ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. కానీ అంతలోనే ఇండోనేషియాలో ఈ ఫోన్ పై నిషేధం విధించింది. అంతేకాదు... ఆ ​​దేశంలో ఉన్న ఐఫోన్ 16 చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఐఫోన్ 16 విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించింది. దీంతో ఆ దేశంలో పర్యటించేందుకు వెళ్దామని భావిస్తున్న టూరిస్టులకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇండోనేషియాలో ఐఫోన్ 16పై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి పరిశ్రమల శాఖ మంత్రి గుమివాంగ్ కర్తసస్మిత తాజాగా ప్రకటించారు. ఇండోనేషియాలో ఆ ఫోన్ వాడేందుకు ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా వాడినట్లయితే అది అక్రమమే అవుతుందన్నారు. అలాంటి ఉదంతాలు ఏమైనా ఉంటే తెలపాలని ప్రజలను కోరారు.

ఇండోనేషియాలో పెట్టుబడికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యాపిల్ సంస్థ విఫలమవ్వడంతోనే అక్కడి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 1.71 మిలియన్ రూపాయలను పెట్టుబడి పెడతామని యాపిల్ హామీ ఇచ్చింది 1.48 మిలియన్ రూపాయలను మాత్రమే పెట్టుబడి పెట్టిందని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.

యాపిల్ తన బాధ్యతలను మరిచిపోవడంతోనే ఐఫోన్ 16పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. ఇండోనేషియాలో విక్రయించాలంటే 40శాతం స్థానికంగా తయారు చేయాలన్న నిబంధన ఉండగా..అది అందుకోవడంలో యాపిల్ విఫలమవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. 



Tags:    

Similar News