Vivek Ramaswamy: అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు..వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు

Vivek Ramaswamy: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ కోతలు విధించే అవకాశం ఉందని రిపబ్లికన్ పార్టీనేత వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-16 07:22 GMT

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు కేటాయించింది. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అగ్రరాజ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ఈ మధ్యే ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్ మస్క్ ఉన్నాము. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నామని ఉద్యోగుల కోతలపై సంకేతాలు ఇచ్చారు. మీకు ఎలాన్ మస్క్ గురించి ఇంకా తెలుసో, లేదో ఆయన ఉలి తీసుకురాక రంపం తీసుకువచ్చారు.

మేము దాన్ని బ్యూరో క్రసీకి వాడాలనుకుంటున్నాము. గత నాలుగేళ్లలో మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. మనం ఇప్పుడు పతనం అంచున ఉన్నామన్న సంగతి గుర్తించుకోవాలి. ఈ పరిస్థితిలో మనం కొనసాగకూడదు. మంచిరోజులు ముందు ఉన్నాయి. అమెరికాల కొత్త పొద్దు పొడవనుంది. నిబద్ధత, కఠిన శ్రమతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం అవుతున్నాము.జాతితో సంబంధం లేకుండా నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆశయమని రామస్వామి వివరించారు.

అధ్యక్ష ఎన్నికల్ల విజయం సాధించిన ట్రంప్ తన గెలుపు కోసం దోహదం చేసినవారిని కీలక పదవుల్లో నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ భారత్ సంతతికి చెందిన పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామిలకు తన కార్యవర్గంలో చోటు కల్పించారు. వీరిని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సంయుక్త సారథులుగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో కీలక మార్పులు తేనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ డోజ్ విభాగం కోసం ఉద్యోగుల నియామకాలు కూడా ప్రారంభించారు. ఈమేరకు ఈ శాఖ సోషల్ మీడియాఎక్స్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. మస్క్, వివేక్ కోసం 80గంటలు పనిచేసేవారు, ఐక్యూ ఉన్న దరఖాస్తు చేసుకోవాలని ఆ పోస్టులో పేర్కొన్నారు. 

Tags:    

Similar News